Panic incident in mahaboobnagar district

panic incident in mahaboobnagar district

panic incident in mahaboobnagar district

9.gif

Posted: 08/05/2012 04:20 PM IST
Panic incident in mahaboobnagar district

       మూఢాచారాలపై అనేక స్వచ్చంధ సంస్థలతో పాటు ప్రభుత్వాలు ప్రజలలో అవగాహన పెంచేందుకు అనేక రకాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నా అవి కాగీతాలకే పరిమితమవు తున్నాయనడానికి ఇలాంటి ఘటనలే సాక్ష్యం. మూఢాచారాలపై నేటికీ ప్రజల్లో విశ్వాసం బలంగా వుందని చెప్పకతప్పదు. మహబూబ్ నగర్ జిల్లాలోని తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఇద్దరు మహిళలు చేతబడి చేశారనే నెపంతో గ్రామస్తులు పైశాచికంగా దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామంలో భయాందోళనకర వాతావరణం నెలకొంది. విషయం తెల్సుకుని వెళ్లిన పోలీసులను సైతం గ్రామస్తులు అడ్డుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో మూఢనమ్మకాలపై చైతన్యపరిచేందుకు వెళ్లిన కళాబృందాన్ని సైతం అడ్డుకున్నారు. ఈ ఘటనపై ఇంతవరకు ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం. mbnr
       జిల్లాలో నిత్యం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ఆధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనేది స్పష్టమవుతోంది. అలాగే జిల్లాలోని నల్లమల ఆటవీ ప్రాంతమైన బల్మూరు, ఉప్పునుంతల మండలాలతో పాటు రాష్ట్ర రాజధానికి చేరువలో వున్న అమనగల్లు, వంగూరు మండలాలో కూడా ఇలాంటి సంఘటనలు గతంలో జరిగాయి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆధికారులు హంగామా చేయడం మినహా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. గతంలో మూడనమ్మకాలపై రెవెన్యూ, పోలీసు ఆధికారులు వీధి నాటకాలతో ప్రదర్శనలు ఇస్తూ ప్రజలల్లో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేసేవారు. ఇందుకు పోలీస్‌ శాఖలో ప్రత్యేకంగా ఒక టీంను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఆధికారులు ప్రత్యేక చొరవ తీసుకోకపోవడం వల్ల మూఢనమ్మకాలు ప్రజల్లో పెచ్చురిల్లుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు చొరవచూపకపోతే గ్రామాల్లో శాంతియుత వాతావరణం లేకుండా పోతుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Neelima last e mail to her husband
Diginal signs in ap government  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles