వైద్యులుగా చలామణీ అవుతున్న నకిలీల ఏరివేత పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మొన్నటికిమొన్న తిరువణ్ణామలై జిల్లాల్లో 24 మంది నకిలీ వైద్యుల గుట్టును పోలీసులు రట్టు చేయగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో నకిలీ వైద్యుల భరతం పట్టేందుకు పోలీసుల తనిఖీల వేటలో పడ్డారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నకిలీ వైద్యుల హవా చెలరేగుతున్నట్టు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో నకిలీల ఏరివేతకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలు నకిలీ వైద్యుల అరెస్టుల పర్వానికి తెరతీశారు. పలు జిల్లాల్లో జరిగిన తనిఖీల్లో పలువురు నకిలీల ముసుగులను పోలీసులు తొలగించారు. విల్లుపురంలో ముసాబేగ్, అరివళగన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుప్పూర్ జిల్లా పరిధిలో జేమ్స్ అహ్మద్ (36), మోబిన్బేగం(32), జోసఫ్(42), కరుప్పయ్య(34) లను అరెస్టు చేశారు. పల్లడం కుప్పుస్వామి నాయుడుపురానికి చెందిన సుబ్రమణ్యం(56) అనే నకిలీవైద్యుడిని పోలీసులు గుర్తించి అతనిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే సేలం జిల్లా పరిధిలో చిన్నస్వామి (48), రత్నవేలు (47)లను పోలీసులు అరెస్టు చేశారు. వేలూరు జిల్లాలో కృష్ణమూర్తి (60), ఆరోగ్యరాజ్(45), దక్షిణామూర్తి (60), సింగారవేలన్(40), మురళి (51) అనేవారిని పోలీసులు నకిలీలుగా గుర్తించారు. వీరిలో పలువురు కనీసం పదవ తరగతి ఉత్తీర్ణత లేని వారు కూడా వుండడం గమనార్హం. వీరంతా ఆయా ప్రాంతాల్లో స్వంతంగా క్లినిక్లను నిర్వహిస్తూ వైద్యలుగా చలామణీ అవుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more