Anna hajare ultimatum

anna hajare ultimatum

anna hajare ultimatum

19.gif

Posted: 07/30/2012 04:48 PM IST
Anna hajare ultimatum

       ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారే మరోసారి కేంద్ర ప్రభుత్వంపై సమరశంఖం పూరించారు. లోక్ పాల్ సహా ఇతర డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వానికి ఇచ్చిన గడువు పూర్తి కావడంతో జంతర్ మంతర్ వద్ద  అన్నా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. గత ఐదురోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న తన సహచరులతో కలిసి ఆయన దీక్షలో కూర్చున్నారు. తమ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపై అన్నా హజారే ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్ లోక్ పాల్ కోసం ప్రాణం పోయే వరకు పోరాడతానని స్పష్టం చేశారు.
      anna అన్నా హజారే దీక్షకు మంచి స్పందనే వస్తోంది. దీక్షా ప్రాంగణం అన్నా హజారే మద్దతు దారులతో నిండిపోయింది. భారత్ మాతా కీ జై, వందేమాతరం, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ కార్యకర్తల నినాదాలు హోరెత్తాయి.  మరోవైపు దేశ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో అన్నా దీక్షకు మద్దతుగా దీక్షలు కొనసాగుతున్నాయి. చెన్నైలో కొందరు కార్యకర్తలు కేంద్ర మంత్రి చిదంబరం ఇంటి ముందు ధర్నాకు దిగారు. అన్నా కు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే పోలీసులు కార్యకర్తలందరినీ అరెస్టు చేశారు.  అన్నా చేస్తోన్న నిరవధిక దీక్ష పై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Duplicate indian students in england
Ramdevbaba statements on curruption  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles