Gunman kills 12 wounds 59 at qbatmanq premiere in colorado

Gunman kills 12, wounds 59 at "Batman" premiere in Colorado, Colorado shooting unlikely to spur changes in gun law Colarado massacre, colarado denver state, colarado massacre suspected james holmes, a ph.d student, pschycology student from colarado university, temporal illusions, fireball, 12 killed 58 injured, 6 years ago, when he was 18, sandeigo, miramir college alumni, aurora victims, century 16 theatre

Gunman kills 12, wounds 59 at "Batman" premiere in Colorado

Gunman.gif

Posted: 07/24/2012 11:16 AM IST
Gunman kills 12 wounds 59 at qbatmanq premiere in colorado

Gunman kills 12, wounds 59 at "Batman" premiere in Colorado

"ప్రేమకోసం, ప్రేమించిన వారికోసం ప్రాణాలిస్తాం''.. ఇది తెలుగు సినిమాల్లో రొటీన్‌గా వినబడే డైలాగ్. కానీ ఈ మాటల్ని చేతల్లో చూపించారు ముగ్గురు అమెరికా కుర్రాళ్లు. తమ ప్రేయసులకోసం తుపాకీ గుళ్లకు ఎదురొడ్డారు. తమ ప్రాణాల్ని ఫణంగా పెట్టి తమ నెచ్చెలిని బతికించుకున్నారు. వారు మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దేశంలో కళ్లు చెమర్చే ఈ ఘటన అమెరికాలోని ఓ థియేటర్‌పై ఓ ఉన్మాది జరిపిన కాల్పుల సందర్భంగా చోటు చేసుకుంది. మాట్ మెక్‌క్విన్(27), జొనాథన్ బ్లంక్(26), అలెక్స్ టెవెజ్(24) తమ ప్రియురాళ్లతో కలిసి బాట్‌మన్ సిరీస్‌లో కొత్తగా విడుదలైన సినిమా 'ద డార్క్‌నైట్ రైజెస్' సినిమా మొదటి షోకు వెళ్లారు. సినిమా మొదలైన కొద్ది సేపటికే జేమ్స్ హోమ్స్ అనే ఉన్మాది విచక్షణారహితంగా థియేటర్‌లోని జనంపై తుపాకీతో కాల్పులు ప్రారంభించాడు. తుపాకీ గుళ్లనుంచి తన ప్రేయసి సమంతా యోలర్‌కు తుపాకీ గుళ్లు తగలకుండా మెక్‌క్విన్ అడ్డంగా నిలబడ్డాడు.

Gunman kills 12, wounds 59 at "Batman" premiere in Colorado1

తన ప్రాణాలను అర్పించి ప్రేయసిని బతికించుకున్నాడు. బ్లంక్ అయితే తన ప్రియురాలు జెన్సన్ యంగ్‌ను సీటుకింద కూర్చోబెట్టి బుల్లెట్ల బారినుంచి రక్షించాడు. ఈక్రమంలో తాను ఆ తుపాకీ తూటాలకు బలైపోయాడు. తనను బతికించడంకోసమే బ్లంక్ ప్రాణాలర్పించాడంటూ ఆ ప్రేయసి కన్నీరుమున్నీరవుతోంది. మూడో యువకుడు టెవెజ్ తన నెచ్చెలి అమందా లిండ్జెన్ ప్రాణాలను కాపాడడానికి ఆనందంగా తుపాకీ గుళ్లను స్వీకరించాడు. ఆమెకు రక్షణ కల్పిస్తూ తాను బలైపోయాడు. తమ ప్రేమను బతికించుకోవడానికి ప్రాణత్యాగం చేసిన ఈ ముగ్గురికి యావద్దేశం నివాళులర్పింస్తోంది.

Gunman kills 12, wounds 59 at 'Batman' premiere in Colorado

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Akhilesh renames 8 major districts carved out by mayawati
Agatha sangma resigns from manmohan government  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles