Hinduja power plant

hinduja power plant

hinduja power plant

7.gif

Posted: 07/22/2012 01:51 PM IST
Hinduja power plant

      హిందూజా పవర్ ప్లాంట్ నిర్వాసితుల సమస్యలపై త్వరలో ఉన్నత స్దాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మౌలిక వసతులు పెట్టుబడుల శాఖ మంత్రి గంటాశ్రీనివాసరావు చెప్పారు. ప్రభుత్వ అతిథిగృహంలో ప్లాంటు నిర్వాసితులు, జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, gaపరిశ్రమల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పరిశ్రమలు ఎంత ముఖ్యమో నిర్వాసితులకు అందాల్సిన ప్యాకేజీ కూడా  అంతే ముఖ్యమని గంటా అన్నారు. త్వరలో హిందూజా కంపెనీ పెద్దలతో త్వరలో ఓ సమావేశాన్ని నిర్వహించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. అయితే..  మంత్రి హామీపై నిర్వాసితులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం కంటి తుడుపు మాటలే తప్ప ఆచరణ సాధ్యం కానివని అభిప్రాయపడ్డారు. హిందూజా పవర్ ప్లాంట్ నిర్మాణానికి నిరభ్యతర పత్రం లేకపోయినా ప్రాజెక్ట్ పనులు చకాచకా సాగిపోతుండం పై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల 23న ప్రాజెక్ట్ పనులను అడ్డుకుంటామని ప్రకటించారు. పరిశ్రమలకు భూములు ఇచ్చిన రైతులకు అందించాల్సిన పరిహారం విషయంలో ప్రభుత్వం, సుప్రిం కోర్టు మార్గదర్శకాలను బుట్టదాఖలు చేస్తోందని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana jac meet
Rains rains rains in andhrapradesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles