Rains rains rains in andhrapradesh

rains rains rains in andhrapradesh

rains rains rains in andhrapradesh

13.gif

Posted: 07/22/2012 12:59 PM IST
Rains rains rains in andhrapradesh

       శుక్రవారం రాత్రి నుండి ఏకథాటిగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దైంది. నిన్న సాయంత్రం వరకూ 223మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. కోస్తాంధ్రలో సగటు కంటే 12శాతం, తెలంగాణలో ఒక శాతం అధికంగా నమోదు కాగా రాయలసీమలో ఆరు శాతం తక్కువగా నమోదైంది. అటు భారీగా కురుస్తున్న వర్షాలతో వరంగల్ జిల్లా తడిసి ముద్దయింది. జిల్లాలో ఇప్పటివరకూ సగటున 21సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లక్కవరం సరస్సులో నీటి సామర్థ్యం 34అడుగులు కాగా ప్రస్తుతం 24అడుగుల మేర నీరు చేరింది. పలు మండలాల్లో చెరువులు, కుంటల్లో నీటిమట్టం పెరిగింది. మెదక్ జిల్లాలో భారీ వర్షానికి ఓ పాఠశాల భవనంలోని గది కూలిపోయింది. మానూర్ జిల్లా rains1పరిషత్ పాఠశాల గది కూలడంతో విద్యార్థలకు సెలవు ప్రకటించి ఇళ్ళకు పంపించేశారు. ఇక  నల్లగొండ జిల్లాలో నాలుగురోజులనుంచి కురిసిన వర్షాలకు రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి నల్గొండ పట్టణంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. విరామం లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ఉద్యోగులు, విద్యార్థులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం జిల్లాలో భారీ వర్షంతో జలాశయాలన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువున కురుస్తున్న వర్షాలతో గోదావరి నదిలో వరద నీరు వచ్చి చేరుతోంది. ఆదిలాబాద్ పల్లెల్లో రైతులు వ్యవసాయ పనులను ప్రారంభించారు.
 
    ఇన్ని రోజులు వర్షం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన అన్నదాతలు ఆగకుండా కురుస్తున్న వర్షాలతో నాగలి చేతబట్టారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో గుంటూరు జిల్లా వాసులు rain2ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెనాలి డివిజన్ లో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. నిన్న సాయంత్రానికి 17మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో గాలులతో కూడిన వర్షం జనజీవనాన్ని స్థంబింప జేసింది. వర్షపు నీరు రోడ్లపై నిలబడి పోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏకధాటిగా కురిసిన వర్షంతో కర్నూలు జిల్లా అతలాకుతలమైంది. జిల్లాలోనే నంద్యాలలో అత్యధిక వర్షపాతం నమోదైంది. గాలులతో కూడిన వర్షం కురవడంతో జనజీవనం స్థంబించింది. చలిగాలులకు జనం వణికిపోయారు. చిప్పగిరి మండలం నగరడోన సమీపంలోని వాగులో కారు, ఆటో కొట్టుకుపోయాయి. సుమారు పది మంది గల్లంతైనట్లు సమాచారం. రాయలసీమలో కరువు ప్రాంతంగా ముద్రపడిన అనంతపురం వరుణుడి రాకతో పులకించిపోయింది. గంటల తరబడి వర్షం కురవడంతో ప్రజలు, రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hinduja power plant
Cong chief botsa supports telangana formation  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles