రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) వడ్డీరేట్లను తగ్గించే అవకాశం లేదు. ఈ విషయం ఆర్బిఐ గవర్నర్ సుబ్బారావు పరోక్షంగా చెప్పారు. ద్రవ్యోల్బణం ఇప్పటికీ తాము ఆశించిన స్థాయికంటే చాలా ఎగువన ఉందని సుబ్బారావు అన్నారు. విధానపరమైన చర్యలకు వెసులుబాటు లభించాలంటే ద్రవ్యోల్బణం 5 శాతం స్థాయిలో ఉండాలని సుబ్బారావు అన్నారు. హోల్సేల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 7.25 శాతం, వినియోగదారుల ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయిలో ఉండటాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ నెలాఖరులో ఆర్బిఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష చేపట్టనుంది. జూన్ నెల ద్రవ్యోల్బణం గత ఏడాదితో పోలిస్తే ఈ జూన్లో భారీగా తగ్గడంతో వడ్డీరేట్లు తగ్గింపు ఖాయమంటూ కొందరు ఎనిలిస్టులు అంచనావేశారు. సుబ్బారావు వ్యాఖ్యలతో వారి అంచనాలు అడ్డం తిరిగే అవకాశం ఉంది. ఆర్బిఐ తీసుకునే చర్యలకు ఈ ద్రవ్యోల్బణం గణాంకాలు సూచికాలు కాదని అంటూనే తాము కోరుకుంటున్న స్థాయి కంటే ద్రవ్యోల్బణం హెచ్చు స్థాయిలో ఉందని సుబ్బారావు వ్యాఖ్యానించారు. ఆర్బిఐ మాజీ గవర్నర్ ఐజి పటేల్ రాసిన వ్యాసాల సంకలాన్ని సుబ్బారావు ఆవిష్కరించారు. ఈ సంకలనాన్ని ఆర్బిఐ మరో మాజీ గవర్నర్ యాగా వేణుగోపాలరెడ్డి ఎడిట్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more