As outrage grows in syria report of a breakthrough for humanitarian aid

As outrage grows in Syria, report of a 'breakthrough' for humanitarian aid

As outrage grows in Syria, report of a 'breakthrough' for humanitarian aid

Syria.gif

Posted: 07/14/2012 12:03 PM IST
As outrage grows in syria report of a breakthrough for humanitarian aid

As outrage grows in Syria, report of a 'breakthrough' for humanitarian aid

ప్రజాందోళనతో అట్టుడుకుతున్న సిరియా మళ్లీ నెత్తురోడింది. హమా రాష్ట్రంలోని ట్రీంసా గ్రామంలో ప్రభుత్వ బలగాలు జరిపిన దాడుల్లో 200 మందికి పైగా ప్రజలు మృతిచెందారని తిరుగుబాటుదారులు వెల్లడించారు. సైనికులు యుద్ధ ట్యాంకులు, హెలికాప్టర్లతో గ్రామంపై మధ్యాహ్నం నుంచి రాత్రివరకు భారీ ఎత్తున బాంబులు కురిపించారని రెబల్స్ నేత అబూ మహమ్మద్ తెలిపారు. అయితే దాడుల్లో 150 మంది చనిపోయారని బ్రిటన్‌కు చెందిన లిబియా మానవ హక్కుల పర్యవేక్షణ సంఘం చీఫ్ రమీ అబ్దుల్ రెహ్మాన్ చెప్పారు. దాడిలో మరణించిన 30 మంది గ్రామస్థుల మృతదేహాలను గుర్తించినట్టు ఆయన టెలిఫోన్ ద్వారా పేర్కొన్నట్టు ఏఎఫ్‌పి వార్తా సంస్థ తెలిపింది.

సైనికులు గ్రామానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో కొండల్లో ఉండి దాడి చేశారని రెబల్స్ తెలిపారు. గ్రామంలో రెబెల్స్‌కు చెందిన ఫ్రీ సిరియన్ ఆర్మీ(ఎఫ్‌ఎస్‌ఏ)కి, సైనికులకు మధ్య ఘర్షణ జరిగిందని, ఎఫ్‌ఎస్‌ఏ గట్టిగా పోరాడలేకపోయిందని హమాకు చెందిన మానవ హక్కుల కార్యకర్త అబూ ఘాజీ చెప్పారు. క్షతగాత్రులకు ఒక మసీదులో చికిత్స అందిస్తుండగా, మసీదుపై కూడా సైన్యం బాంబులతో విరుచుకపడటంతో మరింత ఎక్కువగా ప్రాణనష్టం పెరిగిందన్నారు. ఏడువేల మంది జనాభా ఉన్న ట్రీంసాం గ్రామం ప్రస్తుతం ఖాలీ అయిపోయిందన్నారు. గ్రామంలో ఆర్మీకి, ఉగ్రవాదులకు మధ్య పోరు జరిగిందని, చాలా మంది ఉగ్రవాదులతోపాటు, ముగ్గురు సైనికులు చనిపోయారని ప్రభుత్వ వార్తాసంస్థ సనా వెల్లడించింది. కాగా 200 మంది చనిపోయారని రెబెల్స్ చెబుతున్నదే నిజమైతే అధ్యక్షుడు అల్ బషర్ పాలనకు వ్యతిరేకంగా గత ఏడాది మార్చిలో ప్రజాందోళన ప్రారంభయ్యాక ఇంతభారీ స్థాయిలో ప్రాణనష్టం జరగడం ఇదే తొలిసారవుతుంది. సిరియాలో 12 ఏళ్లుగా అధికారం చలాయిస్తున్న బషర్ పాలనకు వ్యతిరేకంగా, ప్రజస్వామిక సంస్కరణల కోసం విపక్షాలు ఉద్యమిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shah rukh khan coughs up rs 50000 fine
Michelle obama death threat by dc police officer prompts secret service investigation  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles