Health minister d l ravindra reddy stages quit drama

Health minister D L Ravindra Reddy stages quit drama

Health minister D L Ravindra Reddy stages quit drama

minister.gif

Posted: 07/12/2012 05:53 PM IST
Health minister d l ravindra reddy stages quit drama

Health minister D L Ravindra Reddy stages quit drama

 డాక్టర్లు విద్యుక్త ధర్మాన్ని మరిచి సామాజిక ద్రోహానికి పాల్పడుతున్నారని ఆరోగ్య శాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి విమర్శించారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కుటుంబ సంక్షేమ శాఖ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ప్రజాముఖం (పబ్లిక్ ఫేస్)గా పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన సేవలు అందించడంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు దాదాపు విఫలమయ్యాయన్నారు. ప్రాథమికమైన వైద్య సేవలన్నీ గ్రామాల స్థాయిలోనే అందాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. తన సొంత ఊర్లోని పీహెచ్‌సీకి డాక్టరును నియమించినా.. రావడం లేదని వాపోయారు. ప్రాథమిక వ్యవస్థ విఫలం కావడానికి ప్రభుత్వం పరంగానూ లోపాలున్నాయని మంత్రి అంగీకరించారు. క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ‘‘రెఫరెల్ వ్యవస్థ మన రాష్ట్రంలో లేదు. ఈ విధానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. దీంతో ఇటు రోగుల మీద భారం తగ్గుతుంది.. అటు వైద్యుల మీద కూడా ఒత్తిడి ఉండదు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ సూచన మేరకు జమ్మూ కాశ్మీర్ సందర్శించా. అక్కడ ‘ప్రాథమిక’ వైద్య వ్యవస్థ సమర్థంగా పనిచేస్తోంది’’ అని డీఎల్ చెప్పారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల లక్ష్యసాధనలో తొలి, రెండో స్థానాల్లో నిలిచిన గుంటూరు, అనంతపురం జిల్లాలకు అవార్డులు దక్కాయి. ఈ అవార్డులను జిల్లా కలెక్టర్లకు అందించారు. ఉత్తమ సేవలు అందించిన డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బందికీ అవార్డులు ప్రదానం చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Two serving judges arrested in cash for bail scam
Mahatma gandhi not formally conferred father of the nation title government  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles