Mahatma gandhi not formally conferred father of the nation title government

Mahatma Gandhi not formally conferred 'Father of the Nation' title: Government,father of the nation, Mahatma Gandhi, RTI,Right to Information (RTI) Act,ministry of home affairs,Mahatma Gandhi,Father of the Nation,Director and Central Public Information Officer,Central Public Information Officer

Mahatma Gandhi not formally conferred 'Father of the Nation' title: Government

gandhi000.gif

Posted: 07/12/2012 04:13 PM IST
Mahatma gandhi not formally conferred father of the nation title government

Mahatma Gandhi not formally conferred 'Father of the Nation' title: Government

జాతిపిత అన్న బిరుదును ప్రభుత్వం అధికారికంగా మహాత్మాగాంధీకి ఇవ్వలేదని హోం మంత్రిత్వ శాఖ సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపింది. మహాత్మా గాంధీ జాతిపిత అని బహుళ ప్రచారంలో ఉన్నప్పటికీ ఆయనకు ప్రభుత్వం అటువంటి బిరుదు ఏమీ ఇవ్వలేదని సెంట్రల్‌ పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ అధికారి (సిపిఐఒ), డైరెక్టర్‌ శ్యామలా మోహ న్‌ జూన్‌ 18వ తేదీన పంపిన సమాధానంలో పేర్కొన్నారు. ఈ విషయంపైమే 21వ తేదీన సామాజిక కార్యకర్త అభిషేక్‌ కద్యన్‌ హోం మంత్రిత్వ శాఖను సమాచారం కోరారు. ఆయన ఇటలీకి చెందిన జంతు హక్కుల స్వచ్ఛంద సంస్థ ఒఐపిఎకి సలహాదారుగా ఉన్నారు. ఈ విధంగానే మహాత్మాగాంధీని జాతిపితగా ప్రకటిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల ఫోటోకాపీ కోరుతూ లక్నోకు చెందిన ఐశ్వర్య పరాశర్‌ అనే ఆరవ తరగతి విద్యార్ధి సమాచార హక్కు చట్టు కింద కోరగా, దానికి సంబంధించిన నిర్దిష్ట పత్రాలు ఏమీ లేవంటూ సమాధానం వచ్చింది. ఫిబ్రవరి నెలలో ఆమె ప్రధాని కార్యాలయంలోని కేంద్ర పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ అధికారికి ఆర్‌టిఐ దరఖాస్తు పంపారు. ప్రధాని కార్యాలయం నుంచి దానిని హోం మంత్రిత్వ శాఖకు ఫార్వర్డ్‌ చేశారు. కాగా, ఈ దరఖాస్తు తమ పరిధిలోకి రాదంటూ దానిని నేషనల్‌ ఆర్చీవ్స్‌కు హోం శాఖ ఫార్వర్డ్‌ చేసింది. కాగా ఆర్చీవ్స్‌ శాఖ అటువంటి నిర్దిష్ట పత్రాలేమీ తమవద్ద లేవంటూ ఆమెకు సమాధానమిచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Health minister d l ravindra reddy stages quit drama
Chiranjeevi comments on chandra babu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles