Crime rate in the state

crime rate in the state

crime rate in the state

3.gif

Posted: 07/11/2012 01:36 PM IST
Crime rate in the state

     crime1 రాష్ట్రంలో నేరాలు తగ్గుతున్నాయి. ప్రజల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం.. ఈ మాటలు పోలీస్ బాస్ దగ్గర నుంచి ఎస్పీ స్థాయి వరకు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. కాని చేతల్లో మాత్రం ఎక్కడా ఈ పరిస్థితి కనిపించడం లేదు. నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో తెలిపిన వివరాల ప్రకారం నేర ప్రవుత్తిలో అగ్రస్థానంలో ఉంది. బ్యూరో రికార్డ్ 2011ప్రకారం అక్షరాలా లక్షా 89వేల 780కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని 23జిల్లాలలోని 33పోలీసు కేంద్రాలలో ఈ కేసులు నమోదయ్యయి. ఇందులో వరకట్న వేధింపులు అంటే భర్త అతని బంధువులు చేతిలో వేధింపులకు గురై సెక్షన్ 498ఏ కింద 13వేల 376కేసులు నమోదయ్యాయి.
       మహిళలపై అత్యాచార ప్రయత్నం సెక్షన్ 509 క్రింద 3వేల 658కేసులు, అత్యాచారానికి గురైనవారు సెక్షన్ 354క్రింద 4వేల 849 కేసులు, వరకట్న మరణాలు 599, అత్యధికంగా మారణాయుధాలతో దాడి చేసిన ఘటనల కేసులు 54వేల crime_2452అపహారణలకు సంబందించి వెయ్యి 21కేసులు నమోదయ్యాయి. ఇవే కాకుండా ఐ పి సి సెక్షన్ 379, 382 క్రింద 56వేల 534కేసులు, ఐ పి సి సెక్షన్ 419, 420క్రింద 9748కేసులు, సెక్షన్ 449, 452,454,455,457, 460క్రింద 8300కేసులు, ఐ పి సి సెక్షన్ 406, 409, క్రింద 1174కేసులు, ఐ పి సి సెక్షన్ 392, 394, 397, 398క్రింద 600కేసులు నమోదైనట్టు పెర్కొంది. రాజధాని నగరం క్రైం రికార్డ్ లోను అగ్రస్థానంలో నిలిచింది. హత్యనేరాలు అత్యధికంగా హైదరాబాద్, సైబరాబాదు కమిషనరేట్ పరిథిలో 340నమోదయ్యయి. తరువాత మహబుబ్ నగర్ జిల్లాలో 188కేసులు, కర్నూలు జిల్లాలో 153, తరువాత కరీంనగర్ జిల్లాలో 150కేసులు, మెదక్ జిల్లాలో 141కేసులు నిజమాబాదు జిల్లాలో 135కేసులు, కడపలో 120కేసులు నమోదయ్యాయి.
    రాష్ట్రం అభివృద్ది చెందుతుంది అని చెప్పుకుంటున్నా నాయకులకు అలాగే తాము ఎంతో గొప్పలు చేస్తున్నామని చెప్పుకుంటున్నా పోలీసు శాఖ పని తీరు ఏలా ఉందో తెలియజేసేందుకు గణాంకాలు ప్రబల సాక్షంగా నిలుస్తున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Laila khan body parts found in farm house
Gali janardhan reddy bail issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles