Government decide to legal help to 4 ministers

Chief Minister N Kiran Kumar Reddy on Saturday decided to extend legal help to four ministers to fight the case against them in connection with the CBI case on issuance of 26 controversial GOs favouring companies that had invested in the business empire of YSR Congress party president Y S Jaganmohan Reddy.

Government decide to legal help to 4 Ministers.gif

Posted: 07/07/2012 03:36 PM IST
Government decide to legal help to 4 ministers

Kiran-kumar-reddyదివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సయమంలో విడుదలయిన 26 జీవోలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ జీవోలు అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన జగన్ కి లబ్ది పొందే విధంగా ఉన్నాయనే ఆరోపణలతో సుప్రీం కోర్టు నుండి నోటీసులు అందుకున్న మంత్రులకు న్యాయ సహాయం చేయాలని ప్రభుత్వం కొత్త విధానం ప్రవేశ పెట్టింది. ఈ జీవోల పై నోటీసులు అందుకున్న మంత్రులకు లాయర్లకు చెల్లించే ఫీజు ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. ఈ మేరకు దీని పై జీఓను జారి చేసింది.

ప్రభుత్వం నుండి న్యాయ సహాయం పొందే మంత్రుల జాబితాలో ధర్మాన ప్రసాదరావు, కన్నా లక్ష్మినారాయణ, సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డిలకు ఈ సహాయం అందుతుంది. ఇదే జీఓల కేసులో అరెస్టు అయిన మోపిదేవి వెంకటరమణ, ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యల అభ్యర్థను మాత్రం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుమతించనట్లు తెలుస్తుంది. అంటే కిరణ్ కుమార్ రెడ్డి ద్రుష్టిలో ఈ నలుగురు మంత్రుల తప్పులేదని, ఆ ఇద్దరి మంత్రుల తప్పు ఉన్నట్లని భావించే వారికి సహాయం అందించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇలా తప్పుడు పనులు చేసిన మంత్రులకు కూడా న్యాయ సహాయం అందించడం పై పలువురు మండిపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp mla kodali nani to join ysrcp
Tg venkatesh support to samaikyandhra  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles