Court summons ram charan father in law

Upasana Kamineni,Ram charan father in law,Ram charan,kamineni family,Anil Kamineni

The Kamareddy Sub-Court slapped notices on Ram Charans father-in-law Anil Kamineni and Kamineni Umapathy Rao in connection with Ram Charans marriage

Court summons Ram Charan father-in-law.gif

Posted: 07/06/2012 06:33 PM IST
Court summons ram charan father in law

Anil-Kamineniమెగాస్టార్ చిరంజీవి, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి వియ్యంకుడు, రామ్ చరణ్ తేజ మామ, ఉపాసన తండ్రి  అయిన కామినేని అనిల్ కి కామారెడ్డి కోర్టు నోటీసులు జారీ చేసింది. జులై 12 తేదీని విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించినట్లు తెలుస్తుంది. ఈ నోటీసులు రామ్ చరణ్ – ఉపాసనల పెండ్లికి సంబంధించి జారీ కావడం విశేషం.

రామ్ చరణ్ – ఉపాసనల వివాహం జూన్ 14వ తేదీన అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ పెండ్లికి సంబంధించిన కార్యక్రమాలు ఉపాసన పూర్వీకుల గ్రామం అయిన దోమకొండలోని కోటలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం కోసం ఆ గ్రామంలోని కోట చుట్టు నివాసం ఉంటున్న కుటుంబాలను కామినేని అనిల్ బలవంతగా ఖాళీ చేయించారని సమాచారం.

దీని పై బాధితులు కోర్టును ఆశ్రయించారు. తనను అన్యాయంగా ఖాళీ చేయించారని, దానికి తగిన నష్టపరిహారం కూడా చెల్లించకుండా మమ్మల్ని రోడ్ల పై పడేశారని, తమకు న్యాయం చేయాలని సదరు బాధితులు ఫిర్యాదు మేరకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల పై కామినేని అనిల్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cricketer ajay tyagi shot dead in ghaziabad
Cbi special court allows ed to question jagan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles