Pranabmukharjee phone to ys vijayamma

PranabMukharjee Phone to YS Vijayamma

PranabMukharjee Phone to YS Vijayamma

Vijayamma.gif

Posted: 07/02/2012 12:21 PM IST
Pranabmukharjee phone to ys vijayamma

PranabMukharjee Phone to YS Vijayamma

రాష్టప్రతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా యుపిఎ తరఫున పోటీ చేస్తున్న ప్రణబ్ ముఖర్జీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను కోరారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డితోను, పార్టీలోని ఇతర నాయకులతోను చర్చించాక దీనిపై నిర్ణయం తీసుకుంటామని ప్రణబ్‌కు విజయమ్మ తెలియజేశారు. ప్రణబ్ విజయమ్మకు ఫోన్ చేశారు. అయితే అప్పటికే విజయమ్మ విశాఖపట్నాకి విమానంలో బయలుదేరి వెళ్ళిపోవడంతో మాట్లాడటం కుదరలేదు. ఆ తర్వాత మధ్యాహ్నం ప్రణబ్ పిఎ విశాఖ పర్యటనలో ఉన్న విజయమ్మ కుమార్తె షర్మిళకు ఫోన్ చేశారు. అప్పుడు ప్రణబ్ విజయమ్మతో మాట్లాడారు. రాష్టప్రతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని ప్రణబ్ కోరగా, ఇంకా దీనిపై నిర్ణయం తీసుకోలేదని, జగన్‌తోను, ఇతర పార్టీ నాయకులతోను మాట్లాడిన తర్వాత ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని విజయమ్మ వివరించారు. ‘ఆల్ ది బెస్ట్’ అని ప్రణబ్‌కు విజయమ్మ చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు ఎంపీలతో పాటు 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే లోక్‌సత్తా ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ్‌కు కూడా ప్రణబ్ ఫోన్ చేసి రాష్టప్రతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hyderabad jail in dengue fever
Pro telangana protesters greet pranab in hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles