Srikakulam agri chem factory closed

srikakulam agri chem factory closed

srikakulam agri chem factory closed

17.gif

Posted: 07/01/2012 05:42 PM IST
Srikakulam agri chem factory closed

      నాగార్జున అగ్రికమ్ ఫ్యాక్టరీని తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు శ్రీకాకుళం ఆర్డీవో (ఆదివారం) ఈ ఉదయం ప్రకటించారు. దీంతో చిలకపాలెంలోని పొందురు రోడ్డుపై ప్రజలు చేపట్టిన ఆందోళనని విరమించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే దాకా ఈ ఫ్యాక్టరీ తెర వద్దని శ్రీకాకుళం కలెక్టర్ ఆదేశించారని శ్రీకాకుళం ఆర్డీవో వెల్లడించారు. అగ్రికమ్ ఫ్యాక్టరీలో శనివారం రియాక్టర్ నేలి 18 మంది తీవ్ర గాయాలు పాలైన సంగతి తెలిసిందే.
    కాగా,  శ్రీకాకుళం జిల్లా నాగార్జున అగ్రికెమ్ పరిశ్రమ పేలుడులో క్షతగాత్రుల సంఖ్య 16కు చేరుకుంది. చిలకపాలెం సమీపంలోని అగ్రికెమ్ పరిశ్రమలో నిన్న ఉదయం ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని 5వ బ్లాక్ లో పేలుడు సంభవించింది. కెమికల్స్ తయారు చేసే ఐదో బ్లాక్ లో రియాక్టర్ పేలడంతో మంటలు ఎగసి పడ్డాయి. మంటలు క్రమంగా మూడు నాలుగు బ్లాకులకు వ్యాపించాయి. పరిశ్రమ చుట్టూ దట్టమైన 4పొగలు, విషవాయువులు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.  ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పరిశ్రమ యాజమాన్యం, పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో జిల్లా అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. విషవాయువులు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపిస్తాయన్న భయంతో అక్కడి ప్రజలను ఖాళీ చేయించారు. మరోవైపు శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయనగరం జిల్లాల అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
   ప్రమాదం జరిగిన బ్లాకులో మరికొన్ని రియాక్టర్లు ఉండగా వాటికి మంటలు చెలరేగకపోవడంతో భారీ ముప్పు తప్పిందని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్లాక్ లో మొత్తం 60మంది కార్మికులు ఉండాల్సి ఉండగా 40మంది వరకు అల్పాహారం కోసం బయటకు వెళ్లడంతో భారీ ప్రమాదం తప్పినట్లైంది. అటు ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. మరోవైపు విషవాయువులు పీల్చిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని విశాఖకు తరలించి వైద్యం అందిస్తున్నారు. రియాక్టర్ వేడి 180డిగ్రీలు దాటాక కూడా దాన్ని నడపడం వల్లే ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాల కోసం ఎయిర్, వాటర్, సాయిల్ సాంపిల్స్ ను హైదరాబాద్ కు తరలించినట్లు పొల్యూషన్, క్వాలిటీ కంట్రోల్ బోర్టు టాస్క్ ఫోర్స్ అధికారులు చెప్పారు. మరోవైపు పేలుడుపై విచారణ పూర్తయ్యేంత వరకు ప్లాంట్ ను లాకౌట్ ప్రకటించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Presidential election in ap
Large number of ips transfer  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles