రాష్ట్ర ప్రభుత్వం 18మంది ఐపీఎస్ అధికారులకు పదోన్నతులతో పాటు స్థానచలనం కల్పిస్తూ ఆదేశాలు జారీచేసింది. బదిలీ అయిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. పోస్టు కోసం ఎదురుచూస్తున్న సునీల్ కుమార్ ను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీగా సెక్యూరిటీ, కోఆర్డినేషన్ విభాగంలో జాయింట్ కమిషనర్ గా ఉన్న కుమార్ విశ్వజీత్ ను సిఐడీ ఐజీగా ప్రమోట్ చేసింది. ఇక ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న శివధర్ రెడ్డిని ఏసీబీ డైరెక్టర్ గా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న సౌమ్యా మిశ్రను శాంతిభద్రతల ఐజీగా నియమించింది. ఇక కౌంటర్ ఇంటలీజెన్స్ డీఐజీగా ఉన్న వీసీ సజ్జనార్ ను ఎస్ఐబీ డీఐజి గా హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సూర్యనారాయణను ట్రాన్స్ కో చీఫ్ విజిలెన్స్ అధికారిగా ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ ఇంటలీజెన్స్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న విక్రమ్ సింగ్ మాన్ ను వరంగల్ డీఐజీగా హైదరాబాద్ ఇంటలీజెన్స్ ఎస్పీ శ్రీనివాసులు ను కౌంటర్ ఇంటలీజెన్స్ డీఐజీగా పదోన్నతి కల్పించింది. పోస్టు కోసం ఎదురుచేస్తున్న ఉమాపతికి విజిలెన్స్ జేఎండీగా మరో ఐపీఎస్ అధికారి భీమ్ నాయక్ ను కరీంనగర్ డీఐజీగా ప్రమోట్ చేసింది. సీఐడీ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న దామోదర్ ను సీఐడీ డీఐజీగా విశాఖపట్టణం డీసీపీగా ఉన్న బాలకృష్ణను ఇంటెలీజెన్స్ డీఐజీగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇక సెక్యూరిటీ విభాగంలో డీసీపీ గా విధులు నిర్వహిస్తున్న మల్లారెడ్డిని ఏపీఎస్పీ బెటాలియన్ డీఐజీగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న సుందర్ కుమార్ ను అప్పా డిప్యూటీ డైరెక్టర్ గా ప్రమోట్ చేసింది. పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్న మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులు శివప్రసాద్, రవిచంద్రలను సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ, హైదరాబాద్ ఏఐజీగా పోస్టింగ్ ఇచ్చింది. ఇక విజయవాడ రైల్వే విభాగం ఎస్పీగా పనిచేస్తున్న నాగన్నను హైదారాబాద్ డీసీపీగా ఎల్బీనగర్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్న నాగేంద్ర కుమార్ ను మహబూబ్ నగర్ ఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more