Invest in afghanistan india tells traders

Invest in Afghanistan, India tells traders,Afghanistan As An Investment Destination| Afghanistan

Invest in Afghanistan, India tells traders

afghanistan000.gif

Posted: 06/29/2012 04:35 PM IST
Invest in afghanistan india tells traders

 Invest in Afghanistan, India tells traders

అఫ్గానిస్తాన్‌లో ఇప్పుడు సుస్థిర, సురక్షిత పరిస్థితులు నెలకొన్నాయని, భారతీయ కంపెనీలు తమ దేశంలో స్వేచ్చగా పెట్టుబడులు చేయవచ్చని అఫ్గాన్ వాణిజ్య మంత్రి అన్వరుల్ హక్ అహడీ పిలుపునిచ్చారు. ముఖ్యంగా మైనింగ్, మౌలిక, సేద్య రంగాల్లో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. భారత, అఫ్గాన్ ప్రభుత్వాల భాగస్వామ్యంలో సిఐఐ నిర్వహించిన ఢిల్లీ ఇనెవస్ట్‌మెంట్ సమ్మిట్‌లో అహడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ అప్గాన్ పునర్నిర్మాణంలో భారత్ ప్రధాన భాగస్వామిగా వ్యవహరించిందని తెలిపారు. అప్గాన్‌లో పెట్టుబడులు లాభసాటి మాత్రమే కాకుండా స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించగలవని అన్నారు. ఆర్థికాభివృద్ధికి అవసరమైన భద్రత తమ దేశంలో నెలకొందని అహడీ తెలిపారు. గడచిన ఐదారేళ్లలో భారత కంపెనీలు అఫ్గాన్‌లో 1000 కోట్ల డాలర్లవరకు పెట్టుబడులు చేశాయని సీనియర్ అఫ్గాన్ దౌత్యవేత్త ఒకరు వెల్లడించారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను గురించి అహడీ ప్రస్తావిస్తూ భారత్‌కు తమదేశం వ్యవసాయ ఉత్పత్తులు, కార్పెట్లు ఎగుమతి చేస్తోందని, భారత్ నుంచి పారిశ్రామిక వస్తువులతో పాటు ఇతర ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్నామని వివరించారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cpi members attacked ponnalas lakshmaiah residence
Tdp telangana forum oppose rayala telangana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles