Bjp considering change of karnataka cm

BS Yeddyurappa, Bharatiya Janata Party, BJP, DV Sadananda Gowda

Apparently yielding to the demand by former chief minister BS Yeddyurappa and his supporters and also keeping in mind the fast-approaching Assembly polls, the BJP high command is said to have decided to change the 'leadership in Karnataka'. It is sending central observers to Bangalore to elicit views of MLAs and senior leaders

BJP considering change of Karnataka CM.gif

Posted: 06/26/2012 06:16 PM IST
Bjp considering change of karnataka cm

Yadurappa_Sadanada-goudaకర్ణాటక రాజకీయం మళ్ళీ రసదాయకంగా మారింది. ఇన్ని రోజులు కంటిలోని నలుసు లాగా ఎప్పుడు అధిష్టానానికి ఏదో ఒక విధంగా జలక్ లు ఇవ్వడమే కాకుండా, ప్రస్తుత ముఖ్యమంత్రి సదానంద గౌడకు కంటి మీద కునుకు లేకుండా చేసిన యడ్యూరప్ప ఈ మధ్యన కాస్త చల్లబడ్డాడు. ఇక అంతా సవ్యంగా ఉంటుందనుకున్న సమయంలో బీజేపీ అధిష్టానమే ఓ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కర్ణాటక రాష్ట్ర నాయకత్వ మార్పులు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.  తాజాగా అందిన సమాచారం మేరకు.. కర్నాటక బిజెపి ఇంచార్జ్ ధర్మేంద్ర ప్రధాన్, పార్టీ జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి సతీష్‌లు ఈ నెల 28వ తేదిన బెంగళూరు రానున్నారు.

గతంలో యడ్యూరప్ప రాజీనామా తరువాత బీజేపీ ఎవరి అభిప్రాయం తీసుకోకుండానే తన సొంత నిర్ణయంతో సదానందకు సీఎం పీఠం అప్పగించారు. అయితే దీని పై భిన్నాభిప్రాయాలు రావడంతో ఈ సారి అందరి అభిప్రాయాన్ని సేకరించాలని భావిస్తుంది. అభిప్రాయ సేకరణను పార్టీ ఇన్‌చార్జీ ధర్మేంధ్రప్రధాన, కార్యదర్శి సతీష్‌లు చేపట్టనున్నారు. త్వరలోనే సీఎం సదానందగౌడ్, మాజీ సీఎం యడ్యూరప్ప, అధ్యక్షుడు ఈశ్వరప్పలతో పార్టీ ప్రతినిధులు భేటీ అయి ఈ నివేదికను అధ్యక్షుడు గడ్కరీకి సమర్పించిన తరువాత నాయకత్వ మార్పు ఉంటుందని సమాచారం. మరి సదానంద పదవి ఉంటుందో ఊడుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jeevan reddy is joining in ysr congress
Tamil nadu governor rosaiah  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles