Cockroaches must for earths survival

Cockroaches must for Earth's survival,Prof Kambhampati,nitrogen,earth's survival,Cockroaches,Andhra Pradesh Agricultural University

Cockroaches must for Earth's survival

Cockroache.gif

Posted: 06/25/2012 07:22 PM IST
Cockroaches must for earths survival

Cockroaches must for Earth's survival

బొద్దింకలను చూడగానే కొందరు ఆమడ దూరం పారిపోతారు. మరికొందరికి అసహ్యం వేస్తుంది. అయితే బొద్దింకలు లేకపోతే ప్రపంచ మనుగడే ప్రమాదంలో పడుతుందని గుర్తించాలంటున్నారు శాస్త్రవేత్తలు! పర్యావరణ సమతుల్యత కొనసాగాలంటే బొద్దింకలు తప్పనిసరని ఓ తెలుగువాడి అధ్యయనంలో తేలింది. ఆంధ్రప్రదేశ్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చదివిన శ్రీని కంభంపాటి ప్రస్తుతం టెక్సాస్ యూనివర్సిటీ బయాలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.ఆయన ఆధ్వర్యంలో బొద్దింకలపై కీలక పరిశోధన జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 5వేల నుంచి పదివేల రకాల బొద్దింకలు అంతర్థానంకావడంపై పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 'పర్యావరణంలో ప్రధానమైన నైట్రోజన్ చక్రాన్ని నిర్వర్తించడంలో బొద్దింకలు కీలక పాత్ర పోషిస్తాయి. కుళ్లిన పదార్థాలను(ఇందులో నైట్రోజన్ అధికస్థాయిలో ఉంటుంది) అవి ఆహారంగా తీసుకుంటాయి.

దీంతో వాటి వ్యర్థాల ద్వారా ఆ వాయువు భూమిలో కలుస్తుంది. ఇది చెట్ల పెరుగుదలకు దోహదపడుతుంది. బొద్దింకలు లేకపోతే అడవులు దెబ్బతింటాయి. దీంతో మొత్తం జీవజాలమంతా ప్రమాదంలో పడుతుంద'ని శ్రీని కంభంపాటి వివరించారు. అనేక పక్షులు, ఎలుకల వంటి జీవులు బొద్దింకలను ఆహారంగా తీసుకుంటాయని, అవి లేకపోతే అలాంటి జీవుల సంఖ్య కూడా తగ్గిపోతుందని అభిప్రాయపడ్డారు. బొద్దింక జాతుల అంతర్థానంపై దృష్టి సారించాల్సి ఉందని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Supreme court refuses to stay trial against sasikala
Piranha bites off tip of illinois tots finger  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles