Arrangements for tdp maha dhana at vijayawada

Arrangements for TDP Maha dhana at Vijayawada,flyover controversy, vijayawada, durga temple,traffic problem,congress,mp lagadapati rajagopal, tdp chief chandrababu, tdp mla umamaheswararao,devotees facing problems, tdp maha dharna

Arrangements for TDP Maha dhana at Vijayawada

Vijayawada.gif

Posted: 06/25/2012 10:25 AM IST
Arrangements for tdp maha dhana at vijayawada

Arrangements for TDP Maha dhana at Vijayawada

విజయవాడ దుర్గ గుడి పక్కన ఫ్లైఓవర్  నిర్మించాలని  డిమాండ్ చేస్తూ  టిడిపి తలపెట్టిన మహా ధర్మా వివాదాస్పదమవుతోంది.  రాజకీయ చైతన్యవంతమైన విజయవాడ నగరంలో ఏక్షణంలో ఏమి జరుగుతుందో ఏ ఒక్కరికీ తెలియని పరిస్థితి... విజయవాడలో రాజకీయపరంగా మళ్లీ ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. మళ్లీ పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రస్తుత రాజకీయాలు సంచలనాలకు పేరుగాంచిన ఎంపి లగడపాటి రాజగోపాల్ చుట్టూ తిరుగుతున్నాయి. అందుకేనేమో పోలీసు యంత్రాంగం యావత్ ఆయన కార్యాలయం... బస చేసే గృహం... కదలికలపై డేగ కనే్నసి ఉంచింది. జాతీయ రహదారులు ఐదో నెంబర్.. తొమ్మిదో నెంబర్‌లకు అనుసంధానమైన ప్రధాన రహదారి నేటి ఉద్రిక్తతకు కేంద్ర బిందువైంది. ఒక వైపు కృష్ణాతీరం.. మరో వైపు కనకదుర్గమ్మ కొలువై తీరిన ఇంద్రకీలాద్రి మధ్య ఐదో నెంబరు జాతీయ రహదారి వెళుతుంది. ఈ రోడ్డులో దసరా ఉత్సవాలు.. భవానీదక్షల విరమణ... సందర్భాల్లో కేవలం కొద్ది రోజులు ట్రాఫిక్ మళ్లింపు సందర్భంగానే నగరవాసులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇలాంటి సందర్భంలో దుర్గగుడి వద్ద తక్షణం ఫ్లైఓవర్ నిర్మించాలంటూ తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం కుమ్మరిపాలెం సెంటర్‌లో మహాధర్నాకు ఉపక్రమిస్తున్నారు. అయితే ప్రత్యామ్నాయం లేకుండా ఫ్లైఓవర్ నిర్మాణం అసాధ్యమంటూ మొదటి నుంచి వాదిస్తున్న ఎంపి లగడపాటి నేరుగా తమ పార్టీ ప్రజాప్రతినిధులతో చంద్రబాబును కలిసేందుకు సన్నద్ధమవుతున్నారు. తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసి విజయవాడను అన్ని స్థాయిల్లో నిర్లక్ష్యం చేసిన బాబు నుంచి పాఠాలు నేర్చుకుంటామంటున్నారు. అయితే అ ప్రయత్నాన్ని లగడపాటి విరమించుకోవాల్సిందిగా పోలీసు అధికారులు సలహానిస్తున్నారు.

Arrangements for TDP Maha dhana at Vijayawada

కాంగ్రెస్‌కు చెందిన ముఖ్యమంత్రులు పర్యటనకు వచ్చి నప్పుడల్లా తెలుగుదేశంకు చెందిన ప్రజాప్రతినిధులు.. నేతలు కలవడం లేదా.. అలాంటప్పుడు క్యాబినెట్ ర్యాంక్‌లోనున్న ప్రతిపక్ష నేత.. అందునా మాజీ సిఎంను తాము కలిసి వాస్తవాలను వివరించడంలో తప్పు ఏమిటని లగడపాటి ప్రశ్నిస్తున్నారు. అసలు బాబు హయాంలో ఈ ఆలోచన వచ్చిందా.. ముఖ్యంగా విజయవాడ నగరాభివృద్ధికి ఆయన చేసిన కృషి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Us woman jailed for shooting romance tape with son
North block fire fifth incident in six years  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles