State congress leaders in reverse gare

state congress leaders in reverse gare

state congress leaders in reverse gare

27.gif

Posted: 06/24/2012 04:48 PM IST
State congress leaders in reverse gare

      ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఒక్కటిగా కదిలారు. ఒకే వేదికపై నుంచి పత్యర్థి పార్టీలపై విరుచుకుపడ్డారు. సమరానికి సై అంటూ అప్పట్లో కాలుదువ్వారు. కానీ ఫలితాలొచ్చాక సీన్ రివర్స్ అయింది. ఓటమిపై ఎవరికి తోచినట్టు వారు మాట్లాడేస్తున్నారు.4e సమన్వయలోపంతోనే ఓడిపోయామని చిరు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నాయి. వీటిని కొందరి వ్యతిరేకిస్తే మరికొందరు సమర్థిస్తున్నారు. కామెంట్సే కాదు ‍హైకమాండ్ కు నివేదికలు మీద నివేదికలు ఇచ్చేస్తున్నారు. పైకి చెప్పక లోలోపల పరనిందలతోనే రిపోర్టులు సమర్పిస్తున్నారు. ఎవరి కోణంలో వారు మేడమ్ కు నివేదిస్తున్నారు. ఇది అది అని కాదు ఏ అంశమైనా సరే తలోదారి అన్నట్లు కాంగ్రెస్ నేతల పరిస్థితి. కాంగ్రెస్ లో దొంగలున్నారని ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగల నుంచి పార్టీ కాపాడుకుంటామంటూనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ని ఆకానికేత్తేశారు.  మరి కొందరు అవకాశం వచ్చినప్పుడుల్లా సీఎం కిరణపై విరుచుకుపడుతున్నారు. కిరణ్ పనితీరు వల్లే కాంగ్రెస్ తీవ్రంగా నష్ట పోయిందని ఎంపీ వివేక్ అన్నారు. ఇలా ఒక నేత చెప్పిన మాటలకు ఇంకో నేత చెప్పిన మాటలకు పొంతన ఉండటం లేదు. మొత్తానికి మెగా డైలాగ్ లతో మాటల తూటాలు పేలుస్తూ డైలీ సీరియల్లా రక్తికట్టిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  War continues in syria
Iits resolutions  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles