Medical bandh on june 25

Medical bandh on June 25

Medical bandh on June 25

Medical.gif

Posted: 06/23/2012 12:41 PM IST
Medical bandh on june 25

రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25 న 7000 ప్రైవేట్ నర్సింగ్ హోంలు, దాదాపు 15 వేల ప్రైవేట్ క్లినిక్‌లు మూసివేస్తున్నారు. కేంద్ర ప్రభత్వం చర్యలను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) పిలుపు మేరకు జాతీయ స్థాయి సమ్మెలో భాగంగా రాష్ట్రంలో ప్రైవేట్ వైద్యులు సమ్మెకు సన్నద్దమవుతున్నారు. సుమారు 70 వేల మంది వైద్యులు ఈ సమ్మెలో భాగస్వామ్యం అవుతున్నారు. ఐఎంఎ నేషనల్ లీడర్స్ ఫోరం చైర్మన్, స్పెషల్ యాక్షన్ కమిటి ఆల్ ఇండియా ఐఎంఎ స్ట్రైక్ చైర్మన్ డాక్టర్ ఎన్. అప్పారావు, ఐఎంఎ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వి.ఎస్. ప్రసాద్, ఐఎంఎ నాయకులు డాక్టర్ పి. పుల్లారావు, డాక్టర్ ఎం. యాదగిరిరావు, డాక్టర్ జయరాజ్ తదితరులు మాట్లాడుతూ, తప్పని సరిపరిస్థితిలో సమ్మె చేపడుతున్నామన్నారు.

25 న ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు సమ్మె జరుగుతుందని, ఈ సమయంలో అత్యవసర కేసులను సమ్మె నుండి మినహాయిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రైవేట్‌గా ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్లందరికీ ఈ మేరకు సమాచారం అందించామన్నారు. ప్రభుత్వ డాక్టర్లు కూడా ఐఎంఎ చేపట్టిన సమ్మెకు మద్ధతు ప్రకటించారు. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ అంశాలను ఐఎంఏ వ్యతిరేకిస్తోందని అప్పారావు, ప్రసాద్ తదితరులు తెలిపారు. డాక్టర్లతో కూడిన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ) స్థానంలో డాక్టర్లు కాని వారి నేతృత్వంలో నేషనల్ కమిషన్ ఆఫ్ హ్యూమన్ రీసోర్సెస్ ఫర్ హెల్త్ (ఎన్‌సిహెచ్‌ఆర్‌సి) ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాంనబీ ఆజాద్ ఆలోచిస్తున్నారని తెలిపారు. ఈ ఆలోచన సరైంది కాదని, అందువల్ల ఈ తరహా చట్టాన్ని తీసుకురాకూడదని, ఈ మేరకు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఎన్‌సిహెచ్‌ఆర్‌సి బిల్లును వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (సిఇ) చట్టాన్ని రద్దు చేయాలని, దీనివల్ల చిన్న చిన్న ఆసుపత్రులను నడపలేని పరిస్థితి వస్తుందన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న సిఇ చట్టాన్ని కొనసాగించాలని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  New drybath shower gel makes bathwater obsolete
Sand mafia in jaggayyapet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles