Sand mafia in jaggayyapet

sand mafia in jaggayyapet, driver, tractor, sand, bike, village jaggayyapet, madanmohan ,

sand mafia in jaggayyapet

sand.gif

Posted: 06/23/2012 12:33 PM IST
Sand mafia in jaggayyapet

sand mafia in jaggayyapet

బరితెగించిన ఇసుక మాఫియాను అడ్డుకున్న అధికారులపై కూడా దాడులకు పాల్పడటం సర్వసాధారణమైంది. జగ్గయ్యపేట తహశీల్దార్ మదన్‌మోహన్, సర్వేయర్ శ్రీనివాసరావులపై హత్యాయత్నానికి ఒడిగట్టిన సంఘటన మండలంలోని ధర్మవరప్పాడుతండా సమీపంలో రాత్రి జరిగింది. ధర్మవరప్పాడు తండా సమీపంలో అక్రమంగా గ్రావెల్ క్వారీ నిర్వహణ జరుగుతుందన్న సమాచారం మేరకు తహశీల్దార్ మదన్‌మోహన్ సర్వేయర్ శ్రీనివాసరావును వెంట బెట్టుకొని బైక్‌పై అక్కడకు వెళ్లి పరిశీలించారు. ఒక జెసిబి, ఒక ట్రాక్టర్‌ను వారు గుర్తించారు. అనంతరం వేదాద్రి, రావిరాల ఇసుక క్వారీల పరిశీలన నిమిత్తం వెళుతుండగా మార్గమధ్యలో వారికి ఒక ఇసుక ట్రాక్టర్ ఎదురైంది. దాన్ని పట్టుకున్న తహశీల్దార్ జగ్గయ్యపేట రెవెన్యూ కార్యాలయానికి తరలించే ఏర్పాటు చేసి ముందుకు వెళ్లారు. వారికి మరి కొద్ది దూరంలో మరొక ఇసుక ట్రాక్టర్ ఎదురుకాగా దాన్ని ఆపేందుకు ప్రయత్నించగా ట్రాక్టర్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు ట్రాక్టర్‌ను అపకుండా తమ బైక్‌పైకి దూసుకువచ్చినట్లు తహశీల్దార్ తెలిపారు.

కొంత దూరం ట్రాక్టర్‌ను వెంబడించిన తహశీల్దార్, సర్వేయర్ పదేపదే ట్రాక్టర్ మీదకు రావడంతో తప్పించుకొని వేరే మార్గంలో వెళ్లిపోయారు. కొద్దిసేపటి తరువాత గ్రామంలోని ప్రధాన రోడ్డుపైకి వచ్చి ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకొని చిల్లకల్లు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ట్రాక్టర్‌పై యజమాని గుగులోతు తావూరియా, డ్రైవర్ బాణావత్ రాంబాబు ఉన్నారు. ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లు మండలానికి చెందిన ఒక ప్రముఖ కాంగ్రెస్ నాయకుడివిగా తెలుస్తోంది. విషయం తెలుసుకొని డిటి బుల్లిబాబు, పిడిఎస్ డిటి భోజరాజు, విఆర్‌ఒ, రెవెన్యూ సిబ్బంది చిల్లకల్లు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. తహశీల్దార్ ఫిర్యాదు మేరకు నిందితులపై హత్యాయత్నం, ప్రభుత్వ అధికారుల విధులను అడ్డుకున్న కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ప్రసన్నవీరయ్యగౌడ్ తెలిపారు. దాడికి సంబంధించిన సమాచారాన్ని రెవెన్యూ సిబ్బంది సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Medical bandh on june 25
Chiranjeevi predicts doom for congress in 2014 polls  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles