China sends its first female astronaut into space

China sends its first female astronaut into space, China space programme, Shenzhou-9 spacecraft, Liu Yang, first Chinese woman in space,

China sends its first female astronaut into space

China.gif

Posted: 06/19/2012 11:01 AM IST
China sends its first female astronaut into space

China sends its first female astronaut into space

33 ఏళ్ల ఈమె వైమానిక దళంలో పైలట్‌గా పనిచేస్తూ రోదసిలోకి అడుగుపెట్టిన తొలి చైనా మహిళగా చరిత్ర పుటల్లో స్థానం సంపాదించారు. ‘పైలట్‌గా ఉన్నపుడు గగనవీధిలో విహరించానని, ఇపుడు రోదసిలోకి వ్యోమగామిగా వెళ్లడం ఎంతో సంతోషంగా ఉంద’ని యాంగ్ చెప్పారు. పురుషుల కన్నా మేం ఎందులోనూ తక్కువ కాదు.. రోదసి యానంలోనూ మహిళలు అద్భుతాలు సృష్టిస్తారు..’-అని చైనా తొలి మహిళా వ్యోమగామి లియు యాంగ్ ఎంతో ఆత్మవిశ్వాసం ప్రకటించి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఒక బిడ్డకు తల్లి అయినప్పటికీ ఈమె అంతరిక్ష యానంపై తగిన శిక్షణ పొంది అనుకున్న లక్ష్యాన్ని సాధించి మిగతా మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఈమెతో పాటు ఇద్దరు పురుష వ్యోమగాములు ‘షెంజా-9’ వ్యోమనౌక ద్వారా శనివారం అంతరిక్షంలోకి ప్రవేశించారు. పదమూడు రోజుల పాటు సాగే వీరి అంతరిక్ష యాత్రపై భారత్‌తో పాటు పలు దేశాలు ఎంతో ఆసక్తి చూపుతున్నాయి. రోదసిలో కాలుమోపిన 57వ మహిళగా యాంగ్‌కు గుర్తింపు లభించింది. యాంగ్ తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు తాము ప్రయాణిస్తున్న ‘షెంజె-9’ వ్యోమనౌకను రోదసిలో పరిభ్రమిస్తున్న ‘తియాంగాంగ్-1 మాడ్యుల్’తో అనుసంధానం (డాకింగ్) చేస్తారు. ‘డాకింగ్’ ప్రక్రియ ఫలితంగా కక్ష్యలో శాశ్వత అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు మార్గం సుగమమవుతుంది. రష్యా, అమెరికా మాత్రమే ఇంతవరకూ ఇలాంటి శాశ్వత కేంద్రాలు ఏర్పాటు చేశాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Us holds up 400 million dollar cheque to pak
Miniskirt ban at san jose school  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles