Panic incident in tamilnadu

panic incident in tamilnadu

panic incident in tamilnadu

30.gif

Posted: 06/18/2012 08:29 PM IST
Panic incident in tamilnadu

     సభ్య సమాజం తలదించుకునే ఘటన ఒకటి తమిళనాడు లో బయల్పడింది.  రాష్ట్రంలోని మధురైలో ఈ ఘోరం వెలుగు చూసింది. ఓ మహిళ తన కూతురిపై అత్యాచారం చేసేందుకు తన ప్రియుడిని అనుమతించిన ఘటన చోటు చేసుకుంది.10e తన కూతురుని ప్రియుడికి అప్పగించిన మహిళ కుప్పుమణిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె తన పదకొండేళ్ల కూతురుపై అత్యాచారం చేసేందుకు తన ప్రియుడు రవికి అనుమతించింది. విషయం రట్టవటంతో నిందితుడు రవి కన్యాకుమారికి పారిపోయాడు. తర్వాత పోలీసులు అతనిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
       అనంతరం పోలీసులు తల్లి, ఆమె ప్రియుడిపై కేసు పెట్టారు. వారు చేసిన ఘాతుకానికి పోలీసులు వారికి చీవాట్లు పెట్టడమేకాకుండా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధిత అమ్మాయిని పోలీసులు ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేయిస్తున్నారు. పోలీసులు వీరిద్దరిని ఆదివారం అరెస్టు చేశారు.సక్కిమండలంకు చెందిన కుప్పుమణి అనే ముప్పయి అయిదేళ్ల మహిళ రవి అనే నలభై అయిదేళ్ల వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని పోలీసులు చెప్పారు. నిందితుడు రవి ఓ బిల్డింగ్ కాంట్రాక్టర్ అని, అతను వందియుర్‌కు చెందిన వాడు అని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Miniskirt ban at san jose school
Summons for tamilnadu governor rosaiah  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles