ఇవాళ తమిళనాడు గవర్నర్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్యకు ఎసిబి కోర్టు (సోమవారం) సమన్లు జారీ చేసింది. హైదరాబాదులోని అమీర్‌పేట భూముల కేటాయింపు కుంభకోణం కేసులో కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 2వ తేదీన తమ ముందు హాజరు కావాలని కోర్టు రోశయ్యను ఆదేశించింది.అమీర్‌పేటలోని మైత్రీవనం వద్ద కోట్లాది రూపాయల భూమిని డీనోటిఫై చేసిన కేసులో రోశయ్య చీటింగ్, అవినీతి ఆరోపణలను ఎదుర్కుంటున్నారు. 2జి కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది టి. శ్రీరంగారావు - దురుద్దేశ్యాలతో విధులు నిర్వహించిన ప్రభుత్వ సేవకులను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి అవసరం లేదని ఎసిబి కోర్టులో రోశయ్యకు వ్యతిరేకంగా వాదించారు.ఈ కేసులో ఐఎఎస్ అధికారులు బిపి ఆచార్య, టి. సన్యాసి అప్పారావు ఎసిబి కోర్టు ముందు గతంలో సాక్ష్యాలు ఇచ్చారు. భూమిని డీనోటిఫై చేయవద్దని తాము బలంగా చెప్పామని వారన్నారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోట్లాది రూపాయల ఖరీదు చేసే 9.14 ఎకరాల భూమిని డీనోటిఫై చేశారు.
ఇదిలా ఉండగా, మద్యం సిండికేట్ల వ్యవహారంలో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన ఐపీఎస్ అధికారి ఉమేష్ కుమార్‌కు సోమవారం హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 25వరకూ ఉమేష్ కుమార్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ నిలిపివేయాలని న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. అంతలోపు ఐపీఎస్ అధికారి వచ్చి కోర్టులో లొంగిపోవాలని నిర్దేశించింది. ఆ తరువాత నాన్ బెయిలబుల్ వారెంట్ ప్రకారం వ్యవహరించవచ్చని కోర్టు పోలీసులకు సూచించింది.
కాగా, సీనియర్ ఐపీఎస్ అధికారి ఉమేష్‌కుమార్ సస్పెన్షన్ కు రంగం సిద్ధమైంది. ఫోర్జరీ కేసులో ఉమేష్‌కుమార్‌పై సీబీఐ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న ఉమేష్‌కుమార్‌పై సస్సెన్షన్ వేటు వేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more