Cbi now in full swing

cbi now in full swing

cbi now in full swing

24.gif

Posted: 06/18/2012 06:57 PM IST
Cbi now in full swing

     ఉపఎన్నికల నేపథ్యంలో గతకొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న సీబీఐ మరోసారి తన వేగం పెంచింది. ఇందులో భాగంగా విచారణలు వేగవంతం చేస్తుంది. ఇవాళ జగన్ ఆస్తుల కేసులో బీసీసీఐ ఛైర్మన్, ఇండియా సిమెంట్ అధినేత శ్రీనివాసన్ సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు.7e దివంగత ముఖ్యమంత్రి వైయస్ హయాంలో నిబంధనలకు విరుద్దంగా ఇండియా సిమెంట్స్ కు నీటి కేటాయింపులు జరిగాయని సీబీఐ ఆయన్ని విచారిస్తోంది. ఇండియా సిమెంట్ ఎండీ హోదాలో ఆయన సీబీఐ ముందు హాజరయ్యారు. ఇదే కేసులులో మంత్రి పొన్నాల, ఐఏఎస్ అధికారి ఆధిత్యనాథ్ లను సీబీఐ ఇప్పటికే విచారించింది.
      కాగా,  ఎమ్మార్ కేసుకు సంబంధించి ఐఏఎస్ అధికారి, టీటీడీ ఈవో ఎల్వీ సుబ్రమణ్యం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఏపీఐఐసీ ఎండిగా ఉన్నప్పుడు మిగితా నింధితులతో కలిసి ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారని సీబీఐ ఆయనపై అభియోగం కింద ఆయనపై ఐపీసీ 120 బి సెక్షన్ కింద కేసు నమోదు చేసింది. ఈనెల 2న సమన్లు కోర్టు జారీ చేయగా ఇవాళ ఆయన సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఇద్దరి పూచీకత్తుపై ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎమ్మార్ కసులో ఆయన 11వ నింధితుడిగా ఉన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bollywood pair ajay and kajal does a documentary
Telugu desam party self critic  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles