Telugu desam party self critic

telugu desam party self critic

telugu desam party self critic

22.gif

Posted: 06/18/2012 06:42 PM IST
Telugu desam party self critic

      ఉప ఎన్నికల్లో ఓటమిపై టీడీపీ ఆత్మవిమర్శ చేసుకుంటోంది. సమీక్ష సమావేశాలు నిర్వహించి కారణాలను అన్వేషించే పనిలో పడింది. పార్టీ నేతల తప్పిదాలేమైనా ఓటమికి కారణమయ్యాయా అన్న కోణంలో సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేసింది. ఇవాళ్టి నుంచి నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తుంది.  దీంతో ఉప ఎన్నికల ఫలితాలపై తెలుగుదేశం పార్టీ ఆత్మశోధనకు సిద్ధమైనట్టే కనిపిస్తోంది. ఎన్నికలు జరిగిన నియోజక వర్గాల్లో నేటి నుంచి సమీక్షలు నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. వైఎస్ జగన్ అరెస్ట్ తో సానుభూతి పవనాలు వీచాయని అభిప్రాయపడుతున్న పార్టీ నేతలు టీడీపీ విజయం సాధించే అవకాశాలున్న స్థానాల్లో ఎందుకు ఓడిపోయిందన్న దానిపై  చర్చించనున్నారు. గుంటూరు జిల్లాతో ప్రారంభంకానున్న సమావేశాలు 28 దాకా కొనసాగనున్నాయి.6e
      అయితే ఈ సమీక్షల్లో పార్టీ సీనియర్ నేతలతో పాటు నియోజక వర్గాల నాయకులు కూడా పాల్గొని ఓటమికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. నేడు గుంటూరు జిల్లాలో, ఎల్లుండి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరులో, 20న ప్రకాశం జిల్లా ఒంగోలు, ఉదయగిరిలో 21న పాయకరావు పేట, నర్సన్నపేట, 22న పోలవరం,నర్సాపురం, రామచంద్రాపురం, 23న అనంతపురం, రాయదుర్గంలో నిర్వహించనున్నారు. 25వ తేదీన రాయచోటి, రైల్వేకోడూరు, రాజంపేట, 26న తిరుపతి, పరకాలలో, 27న నెల్లూరు పార్లమెంట్ నియోజక వర్గం సమీక్షలు జరగనున్నాయి.
     2014 సాధారణ ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కవ స్థానాలను కైవశం చేసుకోవలని భావిస్తున్న టీడీపీ కిందిస్థాయి నేతలతో కూడా భేటీ అయి పరిస్థితిని మెరుగుపర్చాలని నిర్ణయించింది. ఈ ఎన్నికల్లో రామచంద్రాపురం, నర్సాపురం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలోకి దిగిన వారు  గతంలో టిడిపి నేతలు కావడం కూడా క్రాస్ ఓటింగ్ జరిగిందని నేతలు అంగీకరిస్తున్నారు.
      మరికొన్ని స్థానాల్లో నాయకుల మధ్య సమన్వయలోపం కూడా పార్టీ ఓటమికి దారితీసిందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యుల మధ్య సమన్వయలోపం కూడ పార్టీ ఓటమికి కారణమైనట్లు తెలుస్తోంది. ఈ ఫలితాల వల్ల కుంగిపోవాల్సిన అవసరం లేదని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఉప ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీడీపీకి ఈ సమీక్షలు  భవిష్యత్ లో  ఏ మేరకు  దోహాదం చేస్తాయో చూడాలి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi now in full swing
Congi leaders wants medho madhanm  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles