నెలాఖరుతో ప్రస్తుతమున్న మద్యం విధానానికి గడువు ముగుస్తుండటంతో కొత్త మద్యం విధానానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఇకపై స్థిర లైసెన్స్ విధానం ద్వారా మద్యం దుకాణాలను కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.రాష్ట్రవ్యాప్తంగా వున్న 6596 మద్యం దుకాణాల లైసెన్స్ గడువు ఈనెల 30తో ముగుస్తుంది. దీంతో జులై 1నుంచి కొత్త మద్యం విధానం ప్రకారం దుకాణాలు కేటాయిస్తారు. మద్యం దుకాణాల కేటాయింపు కోసం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానంలో లోపాలు వున్నాయని సర్కార్ భావిస్తోంది.
2010 వేలంలో పెద్దఎత్తున డబ్బులు చెల్లించి దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు అక్రమాలకు పాల్పడ్డారు. ఎమ్మార్పీ ధర నిబంధన ఉల్లంఘించారు. పక్క రాష్ట్రాల నుంచి పన్ను చెల్లించని మద్యం తెచ్చి అమ్మారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం సిండికేట్లపై ఏసీబీ దాడులతో ఈ వ్యవహారం బయటపడింది. దీంతో ప్రస్తుత విధానానికి స్వస్తి పలకాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త ఎక్సైజ్ పాలసీ రూపొందించే బాధ్యతను ముఖ్యమంత్రి ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. అధికారులు పలు రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ అమలవుతున్న విధానాలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం ప్రజాసంఘాలు, వైన్ షాప్ డీలర్లు, డిస్టిలరీ సంఘాలతో చర్చించి సీఎంకి నివేదిక ఇచ్చింది. స్థిర లైసెన్స్ విధానం పెట్టి మద్యం దుకాణాలను కేటాయించాలని సిఫార్సు చేసింది.
ప్రస్తుతం బార్ ల నుంచి స్లాబుల వారీగా లైసెన్స్ రుసుం వసూలు చేస్తున్నారు. అయితే తాజా విధానంలో మద్యం దుకాణాలను కూడా జనాభా ప్రాతిపదికన స్లాబులుగా విభజించి లైసెన్స్ రుసుం వసూలు చేయాలని నిర్ణయించారు. దీనికి ముఖ్యమంత్రికి ఆమోదం తెలిపారు. కొత్త మద్యం విధానానికి సంబంధించిన నోటీసులు నేడో, రేపో విడుదల కానున్నాయి. వెంటనే జిల్లాల వారీగా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించి... ఈ ప్రక్రియను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more