Nara lokesh enters politics in tdp

Nara Lokesh Enters Politics in TDP

Nara Lokesh Enters Politics in TDP

Nara Lokesh Enters Politics in TDP.gif

Posted: 06/14/2012 01:45 PM IST
Nara lokesh enters politics in tdp

Lokeshరాజకీయాల్లో వారసత్వ రాజకీయాలు పెరిగిపోయాయి. తాత, తండ్రి, కొడుకు ఇలా ఒకరి తరువాత ఒకరు రాజకీయాల్లోకి వస్తున్నారు. గత కొంత కాలంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొడుకు అయిన నారా లోకేష్ క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టించాలని చంద్రబాబు చూస్తున్నాడు. కానీ ఇంత వరకు సరైన సమయం కుదరలేదు. గత మహానాడులోనే లోకేష్ కి మంచి ప్రాధాన్యత ఇచ్చి, హైలెట్ చేయాలని భావించాడు. కానీ బుడ్డ ఎన్టీఆర్ తో లుకలుకల వల్ల ఇది సాధ్యం కాలేదు.

ఇప్పుడు వైయస్ జగన్ దూసుకుపోతున్న సమయంలో తెలుగు దేశం పార్టీలోకి కూడా కొత్త యువరక్తం అవసరం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొత్త తరం లేదు. కాబట్టి ఈ పార్టీకి యువ రక్తం అవసరం కాబట్టి లోకేష్ కి ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు కొన్ని కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు మీడియాలో కుప్పలు కుప్పులుగా ప్రసారాలు వస్తున్నాయి. చంద్రబాబుకి కూడా వయస్సు మీద పడింది. ఆయనలో పోరాడే శక్తి ఉన్నా పార్టీ కార్యక్రమాలు నడపడానికి కొత్త తరం నాయకత్వాన్ని ఇప్పటి నుంచే ప్రోత్సహించవలసి ఉంటుంది. ప్రస్తుతానికి లోకేష్ కి  ఎన్.టి.ఆర్.ట్రస్ట్ బాధ్యతలు అప్పగించవచ్చని అంటున్నారు. ఇప్పటికైనా కొత్త తరం నేతలను అభివృద్ది చేయడం తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు మంచిదే నని భావించవచ్చు. మరి లోకేష్ ఎంత వరకు రాణిస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Congress rejects allies options
Telangana separate state soon kcr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles