Nobel slashes prize size as economic crisis bites

human interest,award and prize,Nobel prize money, Nobel slashes prize size, Nobel Prizes, economic crisis

human interest,award and prize,Nobel prize money, Nobel slashes prize size, Nobel Prizes, economic crisis

Nobel slashes prize size as economic crisis bites.gif

Posted: 06/12/2012 02:46 PM IST
Nobel slashes prize size as economic crisis bites

Nobel-Priceఆర్థిక మాంద్యం దెబ్బ అంటే ఏంటో చూపిస్తుంది. దీని పై ప్రభావం వివిధ రంగాలపై చూపించడమే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే నోబెల్ బహుమతి పై కూడా తన ప్రభావాన్ని చూపిస్తుంది. వివిధ రంగాలలలో చేసిన విశేష క్రుషికి గుర్తింపుగా నోబెల్ బహుమత్రి ప్రధానం చేస్తారు. ఈ బహుమతి తో పాటు కొంత మొత్తాన్ని కూడా నగదు రూపంలో ఇస్తారు. కానీ ఈసారి ఇచ్చే నోబెల్ బహుమతి విజేతలకు గత ఏడాదికన్నా 20 శాతం తక్కువ సొమ్మును అందిస్తామని నోబెల్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలియజేసింది. నిన్న జరిగిన బోర్డు డైరెక్టర్ల సమావేశంలో బహుమతి మొత్తాన్ని 10 మిలియన్ల స్వీడిష్ క్రోనార్ల నుంచి 8 మిలియన్ క్రోనార్లకు తగ్గించాలని నిర్ణయించారు.

నోబెల్ ఫౌండేషన్ ద్వారా వైద్యం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సాహిత్యం, శాంతి, ఆర్థిక రంగాలలో విశేష కృషి చేసిన వారికి అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతిని అందజేస్తున్నారు. డైనమేట్‌ను కనిపెట్టిన ఆల్ ఫ్రెడ్ నోబెల్ విల్లు ద్వారా వస్తున్న సొమ్ము నుంచి ఏటా నోబెల్ బహుమతులను అందిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోతోందని ఫౌండేషన్ చైర్మెన్ హెకెన్‌స్టన్ ఆందోళన వ్యక్తం చేశారు. బహుమతి సొమ్మును తగ్గించడం వల్ల నోబెల్ బహుమతి ప్రశంస ఏ మాత్రం తగ్గదని ఆయన అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rare napoleon letter sold for 400000
300 bags with cash seized in bellary  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles