Cbi summons another minister for questioning in jagan case

YS Jaganmohan Reddy, YSR Congress, Central Bureau of Investigation, CBI, Ponnala Lakshmaiah, illegal assets case

Ten days after the arrest of a cabinet minister in Andhra Pradesh in YSR Congress party leader YS Jaganmohan Reddy's illegal assets case, the Central Bureau of Investigation (CBI) has summoned another minister for questioning.

CBI summons another minister for questioning in Jagan case.gif

Posted: 06/05/2012 12:33 PM IST
Cbi summons another minister for questioning in jagan case

Ponnala-laxmaiahవైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్యకి సీబీఐ నుండి పిలుపు వచ్చింది. ఈ నెల 7వ తారీఖున సీబీఐ ముందు హాజరు కావాలని నోటీసు జారీ చేసింది. వైయస్ హయాంలో జరిగిన నీటి కేటాయింపులపై ప్రశ్నించేందుకే నోటీసులు పంపినట్లు తెలిసింది. సీబీఐ విచారణ ఎదుర్కొన్న మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, మోపిదేవి వెంకట రమణ, ధర్మాన ప్రసాదరావుల సరసన పొన్నాల పేరూ చేరనుంది. మరి ఎల్లుండి సీబీఐ విచారణకు హాజరుకానున్న పొన్నాల లక్ష్మయ్యని అరెస్టు చేస్తారా ? లేక విచారించి వదిలి పెడతారా అన్నది చూడాలి.

నిజానికి పరిశ్రమలకు నీటి కేటాయింపులు అనేవి సహజంగానే చేయాల్సి ఉంటుంది. లేకుంటే పరిశ్రమలు నడవవు. అయితే అందులో అవినీతి ఉందా?అన్నదే సమస్య. అవినీతి ఆధారంగానే జగన్ సంస్థలలో పెట్టుబడులు పెట్టారా అన్నది విచారణాంశం. దాంతో అప్పటి మంత్రులు ఇరకాటంలో పడవలసి వస్తుంది. పొన్నాల కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. వాన్‌పిక్ భూముల వ్యవహారంలో మోపిదేవిని పిలిచి ప్రశ్నించిన సీబీఐ అధికారులు ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇతర మంత్రుల్లోనూ అరెస్టుల గుబులు మొదలైంది. ఈ నేపథ్యంలో పొన్నాలకు పిలుపు అందడం గమనార్హం..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dimple yadav files kannauj nomination
Jagan plays badminton with mopidevi in jail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles