Woman mlas second marriage creates controversy

Woman MLA's second marriage creates controversy,rumi nath, congress assam mla, second marriage, marriage with facebook friend,Congress, MLA , Rumi Nath,Gwahati , controversy converting to Islam, divorcing,husband

Woman MLA's second marriage creates controversy

MLA01.gif

Posted: 06/04/2012 11:02 AM IST
Woman mlas second marriage creates controversy

Woman MLA's second marriage creates controversy

సంచలనం రేకెత్తించిన హర్యానా డిప్యూటీ సీఎం చంద్రమోహన్ భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకోవడం... మతం మారి చాంద్ మహ్మద్‌గా పేరుమార్చుకోవడం అప్పట్లో తీవ్ర వివాదమైంది. ఇప్పుడు అలాంటి ఘటనే అసోంలో వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే తన మతం, పేరు మార్చుకొని, రెండో పెళ్లి చేసుకొని మీడియా ముందుకు వచ్చారు. తన మొదటి భర్తకు విడాకులివ్వకుండా రహస్యంగా ఇస్లాం మతంలోకి చేరిన ఆమె.. తన పేరును రబియా సుల్తానాగా మార్చుకొని శనివారం నాడు రెండో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి వ్యవహారంపై బరాక్ వ్యాలీ లాయర్ల అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది. చట్టాన్ని ఉల్లంఘించి రెండో పెళ్లి చేసుకున్న మహిళా ఎమ్మెల్యేను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేసింది.   ఆమె ఓ ప్రజాప్రతినిధి. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ఆ మహిళా ఎమ్మెల్యే చట్టాన్నే ఉల్లంఘించారు. భర్తకు విడాకులివ్వకుండానే రెండో పెళ్లి చేసుకొని వివాదాన్ని సృష్టించారు. అసోం బరాక్ వ్యాలీలోని బోర్ఖోలా నియోజకవర్గం నుంచి డాక్టర్ రుమి నాథ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tintin comic book cover fetches record price at auction
Drinking and driving what you should know  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles