Nuzvid td mla likelyt to join congress

Nuzvid TD MLA likelyt to join Congress, Tirupathi, Congress Party leaders, ajad, CM Kiran Chinnam rama koataiah, MLA

Nuzvid TD MLA likelyt to join Congress

MLA.gif

Posted: 06/04/2012 10:50 AM IST
Nuzvid td mla likelyt to join congress

తిరుపతి వచ్చిన తెలుగుదేశం పార్టీకి చెందిన కృష్ణా జిల్లా నూజివీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య తిరుచానూరు రోడ్డులో మంత్రి పార్థసారధి బస చేసి ఉన్న హోటల్‌కు ముందుగా వెళ్లారు. అక్కడ ఆయనతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం ఆయన వెలుపలకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఈరోజు తన జన్మదినమని, అందుకే తిరుమల శ్రీవారిని దర్శించుకోడానికి వచ్చినట్టు చెప్పారు. తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నట్టు ముక్తసరిగా ప్రకటించారు. 2014లో ఏ పార్టీనుంచి పోటీ చేస్తారన్న ప్రశ్నకు ఇప్పుడే సమాధానం చెప్పలేమంటూ దాటవేశారు. వాస్తవానికి తిరుపతి ఇందిరా మైదానంలో  జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలోనే ఆజాద్, సిఎం కిరణ్‌ల సమక్షంలో టిడిపి ఎమ్మెల్యే రామకోటయ్య కాంగ్రెస్‌లో చేరతారని విస్తృతగా ప్రచారం జరిగింది. అయితే ఆయన వేదిక పరిసర ప్రాంతాల్లోకి రాకుండా హోటల్లోనే కాంగ్రెస్ అగ్రనేతలను కలిసి వెళ్లారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటే సస్పెన్షన్ వేటుపడి ఎక్కడ తన నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వస్తాయోనని యోచించి అధికారికంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. 2014 వరకూ రామకోటయ్య టిడిపిలోనే కొనసాగే అవకాశం లేకపోలేదన్నది.  తెలుగుదేశం పార్టీకి చెందిన కృష్ణా జిల్లా నూజివీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య మరో ట్విస్ట్ ఇచ్చారు. ఉప ఎన్నికల ప్రచారం నిమిత్తం తిరుపతికి వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్, సిఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిలను కలిశారు. ఈ సందర్భంగా రామకోటయ్యను మీడియా కలిసినపుడు ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Drinking and driving what you should know
Dalai lamas china talk envoys resign  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles