Visakha and kadapa terrific news

visakha and kadapa terrific news

visakha and kadapa terrific news

41.gif

Posted: 06/03/2012 05:05 PM IST
Visakha and kadapa terrific news

       విశాఖపట్నంలో (ఆదివారం) ఇవాళ  ఉదయం కలకలం బయలుదేరింది. సముద్రం పొంగుతున్నట్లు, అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నట్లు వార్తలు దావానలంలా వ్యాపించాయి.b దీనితో తీర ప్రాంత ప్రజలు తీవ్ర భాయందోళనలకు గురయ్యారు. రామకృష్ణ బీచ్‌లో ఉదయం అలలు ఎగసిపడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పెదవాల్తేరు వద్ద సముద్రపు నీరు పోటెత్తి మత్స్యకారుల నివాసాల్లోకి చేరడంతో స్థానికుల్లో 'సునామీ' అలజడి చెలరేగింది.
      ఇదిలా ఉంటే, కడపజిల్లాలో మరో వార్త సంచలనం రేకెత్తించింది.  అమ్మవారి ఆకారంలో చెట్టు అంటూ ఓ వార్త కలకలం రేపింది. కడప జిల్లా రైల్వేకోడూరులో అమ్మవారి ఆకారంలో చెట్టు కనిపిస్తోందన్న వదంతి దావానంలా వ్యాపించింది. పాతబజారులో వెలసిన గంగమ్మనది దగ్గర ఉన్న చెట్టుపై అమ్మవారి మొహం, చేతులు, శూలం దర్శనమిస్తున్నాయనే వార్త రావడంతో.. జనం తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు. గత నెల 23న గంగమ్మ జాతర నిర్వహించగా.. జాతర తర్వాత పదమూడో రోజు అమ్మవారి దర్శనం అవుతుందని భక్తులు చెప్పారు. పెద్దఎత్తున భక్తులు చేరుకోవడంతో.. స్వల్ప తొక్కిసలాట జరిగింది. c
    ఈ సంఘటనలు ఇలా ఉండగా,  తిరుమల శ్రీనివాసుని ఉత్సవమూర్తికి మరో జత బంగారు కవచాలను తయారు చేయించేందుకు టిటిడి యాజమాన్యం చర్యలు చేపట్టింది. దాదాపు 40లక్షల రూపాయల వ్యయంతో స్వామివారికి కొత్త జతను చేయించాలని నిర్ణయించినట్లు టిటిడి ఈవో తెలిపారు.  ప్రతియేటా జ్యేష్టమాసం, జ్యేష్టా నక్షత్రం రోజున ఉత్సవమూర్తులకు ఉండే కవచాలను మరమ్మతు చేయించడం ఆనవాయితీ. అయితే కొన్నేళ్లుగా స్వామి, అమ్మవార్లకు అలంకరిస్తున్న బంగారు కవచాలు అరిగిపోవడంతో టిటిడి ఈ నిర్ణయం తీసుకుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dalai lamas china talk envoys resign
World chess champion vishwanathan anand  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles