Parakala by election

parakala by election

parakala by election

13.gif

Posted: 06/03/2012 02:36 PM IST
Parakala by election

      పరకాల ఉపఎన్నిక టిఆర్ఎస్, బిజెపిల మధ్య మాటల యుద్ధాన్ని రాజేస్తోంది. తెలంగాణ కోసం పోరాడుతున్న తమ పార్టీ ఓట్లు చీల్చేందుకే బిజెపి బరిలో నిలిచిందని టిఆర్ఎస్ నేతలు అంటుండగా కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యే తమపై ఆరోపణలు చేస్తున్నారని బిజెపి నేతలు చెబుతున్నారు.8 మరోవైపు తెలంగాణ నగారా సమితి నేతలు టిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.  ఇంకా చెప్పాలంటే తెలంగాణలో జరుగుతున్న ఏకైక ఉపఎన్నిక పరకాల-జెఎసి పక్షాల మధ్య చిచ్చు రాజేస్తుంది. ప్రచార పర్వంలో దూసుకుపోతున్న టిఆర్ఎస్, బిజెపి నేతలు పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. పార్టీ అభ్యర్థి విజయచంద్రారెడ్డి తరపున ప్రచారం నిర్వహించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఒకరిద్దరు ఎంపీలున్న పార్టీతో తెలంగాణ రాదని టిఆర్ఎస్ పై పరోక్ష విమర్శలు చేశారు. జాతీయ పార్టీలతోనే తెలంగాణ సాధ్యమని తేల్చి చెప్పారు.
      ఉపఎన్నికలో తమ ఓట్లు చీల్చేందుకే బిజెపి బరిలో దిగిందని టిఆర్ఎస్ ఎమ్మెల్యే తారకరామారావు విమర్శించారు. కిషన్ రెడ్డి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిలా గాక పార్టీ పరకాల నియోజకవర్గం నేతలా ప్రచారం నిర్వహిస్తున్నారని దుయ్యబట్టారు. టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం తెలంగాణ నగారా సమితి నేతలు ఎమ్మెల్యేలు నాగం జనార్దనరెడ్డి, వేణుగోపాలాచారి, హరీశ్వర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. కెయు, ఓయు విద్యార్థుల బస్సు యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. పరకాలలో సీటు గెలిస్తే బిజేపికి వచ్చేదేమి లేదని, టీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణవాదాన్ని మరింత బలంగా విన్పించేందుకు అవకాశం వుంటుందని నాగం అన్నారు. పంచముఖ పోటీ నెలకొన్న పరకాలలో.. తెలంగాణవాదుల మధ్య మాటల తూటాలు ప్రచారహోరును మరింత పెంచుతున్నాయి

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  These courts not sufficient
Summer heat  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles