Ysvijayammasharmila speech in election campaign

Y.S.Vijayamma,Sharmila Speech in Election Campaign, YS Rajasekhara Reddy, YS jagan, Chief minister,

Y.S.Vijayamma,Sharmila Speech in Election Campaign

Sharmila.gif

Posted: 06/02/2012 12:16 PM IST
Ysvijayammasharmila speech in election campaign

Y.S.Vijayamma,Sharmila Speech in Election Campaign

రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. అందుకోసం రైతుల కోసం, వైఎస్.రాజశేఖర్ రెడ్డికి అండగా ఉండటానికి అవిశ్వాస తీర్మానంలో జగన్‌కు మద్దతుగా ఓటు వేసి ఉప ఎన్నికల బరిలో ఉన్న తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజయమ్మ కోరారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను రోల్‌మోడల్‌గా తీసుకోమని దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సాక్షాత్తూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చెప్పేవారని, అటువంటి వ్యక్తిపై ఇప్పుడు ఆ పార్టీ నేతలు అవినీతి ఆరోపణలు చేయడం దురదృష్టకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనెవస్టిగేషన్ (సిబిఐ) చెప్పినట్టు చెప్పలేదని తన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేశారన్నారు.

తండ్రి వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏనాడూ జగన్ క్యాంప్ కార్యాలయానికిగాని, సెక్రటరియేట్‌కుగాని వెళ్లలేదన్నారు. అలాగే మంత్రులతోను అధికారులతో మాట్లాడిందిలేదని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. వైఎస్సార్ జీవించివుంటే గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యివుండేదన్నారు. అలాగే కృష్ణా, గోదావరి డెల్టాల ఆధునికీకరణ కూడా పూర్తయ్యేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హాయాంలో సంక్షేమ పధకాలు, ప్రాజెక్టుల పనితీరు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని దుయ్యబట్టారు. జనం మధ్యలో ఓదార్పు యాత్ర చేస్తున్న వ్యక్తి సాక్షులను ఏ విధంగా ప్రభావితం చేస్తారని విజయమ్మ ప్రశ్నించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Killer cannibal admits eating house guests heart and brain
Tsr steps up election campaign  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles