Ap government terminates mou with brahmani

The state government has finally terminated the Memorandum of Understa-nding with Brahmani

The state government has finally terminated the Memorandum of Understa-nding with Brahmani

AP government terminates MoU with Brahmani.gif

Posted: 06/01/2012 02:39 PM IST
Ap government terminates mou with brahmani

BILకర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ అక్రమాల కేసులో జైల్లో ఉన్న గాలికి పంచ్ మీద పంచ్ పడుతుంది. వైయస్సార్ హయాంలో గాలి జనార్థన్ రెడ్డికి బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన ఎంఏయూని రద్దు చేస్తూ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైయస్సార్ ఉన్నప్పుడు కడప జిల్లాలో ని జమ్మల మడుగు వద్ద బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు 10,760.66 ఎకరాలను కేటాయిస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి సమక్షంలో 2007 మే 21న పరిశ్రమల శాఖ ఒప్పందం చేసుకుంది.

20 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ నెలకొల్పుతామని, 2017 నాటికి తమ ప్లాంట్ పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యం కోటి టన్నులకు చేరుతుందని బ్రాహ్మణి అప్పట్లో తెలిపింది. ఈ ప్లాంటుద్వారా పది వేల మందికి ప్రత్యక్షంగా, మరో పదివేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని తెలిపింది. ప్రతిపాదిత యూనిట్‌కు రాయితీలు, ప్రోత్సాహకాలు కోరింది. ఈ ప్రతిపాదనలను 2007 మే 21న జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) భేటీలో ఆమోదించగా ప్రభుత్వం జీవో 477 జారీచేసింది. అయితే గడువు ముగిసినా పనులు పూర్తి కాకపోవడంతో ఎంఏయూ రద్దు చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి టీఎస్ అప్పారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  20 above mlas are likely to jump the fence to join ysr congress
Iranian prof cut ate wife s lips  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles