Women helping men

women helping men

women helping men

women.gif

Posted: 05/31/2012 03:28 PM IST
Women helping men

women helping men

జీవిత భాగస్వామిని ఎంచుకునే క్రమంలో అమ్మాయిలు దమ్మున్న మొనగాళ్ల కన్నా.. బలహీనుడైనా చాలు, తమకు అన్నీ సమకూర్చిపెట్టగల మగవారి వైపే మొగ్గు చూపుతారు. ఇది ఈ కాలం నాటి మాట కాదండోయ్! 250"కండలు తిరిగిన గండర గండలం.. మనకేంటి, ఏ అమ్మాయి అయినా మన కండల్ని చూసి పడిపోవాల్సిందే'' అనుకునే పురుషుల దిమ్మతిరిగే కబురు! ఎప్పుడో కొన్ని వేల ఏళ్ల క్రితమే మహిళలు ఇలా ఎంచుకోవడం మొదలైందని, అదే.. 'ఒక భర్త - ఒక భార్య' అనే నేటి ఆధునిక కుటుంబ విధానానికి దారి తీసిందని అమెరికన్ పరిశోధకుల అధ్యయనం.

women helping men

ప్రాచీన యుగాల్లో మనుషుల్లోనూ 'బలవంతుడిదే మగువ' అనే జంతు నీతి రాజ్యమేలేది. అమ్మాయిల కోసం పురుషుల మధ్య యుద్ధాలే జరిగేవి. అందులో గెలిచిన పురుషుడితో సదరు అమ్మాయి జతగూడేది. గెలిచినవారి సంగతి సరే, మరి ఓడినవారి మాట ఏమిటి? పూర్తిగా బలహీనులైన మగవారికి భాగస్వామి దొరికేదెలా? శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్నట్టు.. అలాంటి బలహీనులు.. 'కానుక'లతో మగువల మనుసును ఆకట్టుకునే కొత్త ఆలోచనకు తెరతీశారు. మహిళలకు కావలసిన ఆహారం సమకూర్చడం, వారిని కేరింగ్‌తో చూసుకోవడం మొదలుపెట్టారు.

women helping men

దీంతో కాలక్రమంలో అమ్మాయిలంతా అలా అన్నీ సమకూర్చిపెట్టే మగవారివైపే మొగ్గు చూపడం మొదలుపెట్టారు. దీంతో మగువల కోసం పురుషుల మధ్య కొట్లాటలు తగ్గిపోయాయి. ఒకరికి ఒకరు అనే విధానం మొదలైంది. స్త్రీ ఒకే పురుషుడితో ఎక్కువకాలం బంధం కొనసాగించడం మొదలైంది. దీంతో పురుషులు కూడా కొట్లాటలపై దృష్టి తగ్గించి, మనుగడకు అవసరమైన సదుపాయాలు సమకూర్చుకోవడానికి, కుటుంబాన్ని చూసుకోవడానికి సమయాన్ని వెచ్చించడం మొదలుపెట్టారు.

కొన్నివేల ఏళ్లు గడిచే సరికి ఇదే ఆధునిక కుటుంబ విధానానికి దారి తీసిందని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న సెర్గీ గావ్రిలెట్స్ అనే బయాలజిస్టు విశ్లేషించారు. అయితే.. బలహీనులైనా సరే తమకు అన్నీ సమకూర్చిపెట్టే మగవారితో ఎప్పటికీ కలిసి ఉండాలని స్త్రీ కోరుకోవడమే ఈ మొత్తం ప్రక్రియలో కీలకమైన అంశం అనే విషయాన్ని పురుషులు ఇప్పటికీ గ్రహించలేకపోయారని ఆయన వ్యాఖ్యానించారు. నేషనల్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pak army raids cricketer umar guls house arrests his brother
Ys vijayamma staying at poori jagannath huse in narsipatnam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles