Ysr congress president jagan arrested

ysr congress president jagan arrested

ysr congress president jagan arrested

35.gif

Posted: 05/27/2012 07:06 PM IST
Ysr congress president jagan arrested

      మూడు రోజులుగా సిబిఐ విచారణను ఎదుర్కొంటున్న జగన్ ను సిబిఐ ఈ సాయంత్రం మొత్తానికి అరెస్ట్ చేసింది.  అక్రమ ఆస్తుల కేసులో జగన్‌  సీబీఐ విచారణ ఇవాళ మూడో రోజు కూడా కొనసాగింది. అరెస్ట్  నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు జరుగకుంటా దిల్‌కుషా గెస్ట్ హౌస్ తోపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. రాజ్‌భవన్‌ రోడ్డులో అదనపు బలగాలను మోహరించారు.jagaff

     జగన్ మోహన్ రెడ్డిని సీబీఐ ఆదివారం రాత్రి 7.20 గంటల సమయంలో అరెస్ట్ చేసినట్టు ఆ పార్టీ నేత జూపూడి ప్రభాకర్ రావు మీడియాకు వెల్లడించారు. సోమవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉన్నా కూడా.. జగన్ ను సీబీఐ దుందుడుకుగా వ్యవహరించి అన్యాయంగా అరెస్ట్ చేసిందని ఆయన విమర్శించారు. వైఎస్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎలాంటి ఉద్రేకానికి పోకుండా ప్రశాంతంగా ఉండాలని ఆయన కోరారు.
       ఈరోజు విజయసాయిరెడ్డిని కూడా సీబీఐ పిలిపించి ఉదయం 10.30 నుంచి జగన్‌ను విచారించింది. విద్రోహ శక్తులు అవాంఛనీయ సంఘటనలు రేకెత్తించే అవకాశం ఉందని పోలీసులకు సమాచారం అందటంతో రాష్ర్ట వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. అదనపు బలగాలను మోహరించారు. జగన్‌ నివాసం లోటస్‌పాండ్‌ నుంచి వెైఎస్‌ఆర్‌ పార్టీ కార్యకర్తల్ని పోలీసులు వెనక్కు పంపుతున్నారు. జగన్‌ నివాసం దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.    

     అంతేకాదు.. జగన్‌ అరెస్టు ద్రుష్ట్యా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అల్లర్లు స్రుష్టించే పరిస్థితులు ఉన్నాయన్న సమాచారంతో  సెలవుల్లో ఉన్న పోలీసులను విధులకు హాజరుకావాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. వెైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 ఆర్టీసీ డిపోల్లో బస్సులను ఆర్టీసీ నిలిపివేసింది. హైదరాబాద్‌లో పలు రూట్లలో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. హైదరాబాద్‌లో పోలీసులకు ప్రభుత్వం సెలవులు రద్దుచేసింది. నల్గొండ జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. హైవే పైన భద్రతను కట్టుదిట్టం చేశారు.jaganfe     జగన్ అరెస్ట్ మీద అధికార కాంగ్రెస్ పార్టీ,  ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. ఎలాంటి ఒత్తిళ్లకూ తలొగ్గకుండా చట్టం తనపని తాను చేసుకుపోవాలని వెల్లడించాయి. అయితే జగన్ అరెస్ట్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. జగన్ పార్టీ నేతలు తమ నేతను తక్షణమే విడుదల చేయాలంటూ నినదిస్తున్నారు. 
      ఇదిలా ఉండగా  అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన జగన్ కు సంఘీభావం తెలిపే క్రమంలో భాగంగానూ, ప్రభుత్వంమీద ఒత్తిడి తెచ్చేందుకు  భారీ ఎత్తున అల్లర్లకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.ysr_congress_flag  అరెస్ట్ నేపథ్యంలో గ్రేటర్‌ మహానగరంలో భారీ ఎత్తున విధ్వంసకాండకు పాల్పడేందుకు రంగంలోకి దిగిన వైఎస్సార్‌ సిపికి చెందిన ముగ్గురు కార్యకర్త లను అరెస్టు చేయటం ద్వారా పోలీసు యంత్రాగం కుట్రను భగం చేసిన సంగతి తెలిసిందే. ఇంకా ఇలాంటి కుట్రలకు ఆస్కారం ఉందని సమాచారం అందుకున్న పోలీసులు ఇప్పటికే గ్రేటర్‌ అంతా సాయుధ పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.  జంట పోలీస్‌ కమిషనరేట్లు మరింత అప్రమత్తం చేశారు. ఏకంగా 100 బస్సులను తగుల బెట్టటం ద్వారా శాంతి భద్రత లకు విఘాతం కల్గించే లక్ష్యంగా మియాపూర్‌లో నిప్పంటించేందుకు సీసాల్లో నింపిన పెట్రోల్‌ను తీసుకొని బైక్‌పై వెళుతున్న ఇద్దరితో పాటు మరో సూత్రధారిని అరెస్టు చేసిన క్రమంలో మరిన్ని విషయాలు బయల్పడినట్టు తెలుస్తోంది.
       అంతేకాక,  గ్రేటర్‌ మహానగరంలో 100 బస్సులకు పైగా నిప్పంటించి విధ్వంసకాండ జరుపాలంటూ తనకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సేవాదళ్‌ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు కోటింరెడ్డి వినరురెడ్డి, వైఎస్సార్‌ యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు పుట్ట ప్రతాప్‌రెడ్డి, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎంఎస్‌ రాజ్‌థాకూర్‌ ఆదేశించారని, దీంతో పాటు జగన్‌ అరెస్టయ్యే అవకాశాలున్నందున పెద్ద సంఖ్యలో జైల్‌భరోకు సిద్ధంగా ఉండాలంటూ ఫోన్‌లలో ఎస్‌ఎంఎస్‌ల ద్వారా అందరికీ సమాచారం అందించాలని తెలిపారని చెప్పిన సంగతి విదితమే. ఈ పరిస్థితుల నేపధ్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lagadapati comment on ys vijayamma
Former minister mopidevi venkata ramana in care hospital today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles