Ys jagan mohan reddy

YS Jagan Mohan Reddy, cbi , ministers, IPS Officers, YS Jagan, YSR, Jagan casu,

YS Jagan Mohan Reddy |

Jagan.gif

Posted: 05/21/2012 12:46 PM IST
Ys jagan mohan reddy

YS Jagan Mohan Reddy |

 ఒక్క వ్యక్తిని దెబ్బ తీసేందుకు ఇంతమందిని బలి చేయాలా? అని వారు ప్రశ్నిస్తున్నారు. జగన్ అక్రమ ఆస్తుల కేసులో ఇప్పటికే కొందరు అరెస్టుకాగా, త్వరలోనే మరికొందరు అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో అరెస్టు కానున్న వారి జాబితాలో జగన్‌తోపాటు కొందరు మంత్రులు, ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నట్టు సిబిఐ వర్గాలు చెబుతున్నాయి. కడప లోక్‌సభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్‌రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో అరెస్టుల పర్వం ఎక్కడ ముగుస్తుందో తెలియని అయోమయ గందరగోళ పరిస్థితిలో మంత్రుల్లో అంతర్మథనం మొదలైంది. అక్రమ ఆస్తుల కేసులో జగన్‌ను అరెస్టు చేసినట్లయితే కొందరు మంత్రులు కూడా అరెస్టుకాక తప్పదన్న విషయం దాదాపు తేలడంతో ఆందోళన ఆరంభమైంది. అక్రమ ఆస్తుల కేసు జగన్, మహా అయితే ఒకరిద్దరు ఐఏఎస్ అధికారులకే పరిమితం కావచ్చునని మొదట అనుకున్నారు. కేసులో తమ జోలికి రాక పోవచ్చునని మంత్రులు కొందరు అభిప్రాయపడ్డారు. తమ విషయాన్ని హైకమాండే చూసుకుంటుందని అనుకున్నారు. అయితే ఇపుడు తమవరకు వస్తుండటంతో వారిలో ఆందోళన ఆరంభమైంది. సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన మంత్రులేకాకుండా, వీటితో సంబంధం లేని మంత్రులు సైతం జగన్ వ్యహారాన్ని ‘కోతి పుండు బ్రహ్మ రాక్షసి’ చందాన అధిష్ఠాన వర్గం చేస్తోందని విమర్శిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  The first is called iran the second is called pakistan
A dog to marry lucky and help others in need  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles