Election commission rules and regulations

election commission rules and regulations

election commission rules and regulations

11.gif

Posted: 05/20/2012 01:35 PM IST
Election commission rules and regulations

      డబ్బు మీ ఇష్టాను సారం పంచేస్తామంటే ఊరుకునేది లేదంటోంది ఈసీ.  ఎన్నికల్లో ఇష్టానుసారంగా డబ్బు పంచేందుకు నేతలు చేసే ప్లాన్ కు ఎలక్షన్ కమిషన్ చెక్  పెట్టింది. అందుకే ఇన్ కమ్ టాక్స్  డిపార్ట్ మెంట్  స్కీమ్ ను అనుసరించాలని ఎన్నికల కమిషన్  నిర్ణయించింది. డబ్బు తరలించే సమాచారాన్ని ప్రజల వద్ద నుంచి తీసుకోవాలని ఈసీ సూచించింది.6 అయితే ప్రజలు ఇచ్చిన సమాచారాన్ని ఎట్టిపరిస్థితిలో ఇతరులకు చెప్పకుండా ఎలక్షన్  కమిషన్ అధికారులు గోప్యంగా ఉంచుతారు. ఇప్పటికే ఇన్ కమ్  ట్యాక్స్  అధికారులు ఈ స్కీమ్ ను వర్తింప చేస్తున్నారు. దీన్ని అనుసరించే ఓ ప్రణాళిక సిద్ధం చేయబోతున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్  తెలిపారు. అక్రమంగా డబ్బు తరలిస్తున్న విషయాన్ని ఎన్నికల అధికారులు దృష్టికి తీసుకెళ్తే...ఐదు లక్షలకు మించకుండా  నగదు బహుమతి అందిస్తామని భన్వర్ లాల్  తెలిపారు. ఈస్కీమ్ ను  రాష్ట్రంలో  వర్తింపచేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ కు  లేఖ రాసినట్లు చెప్పారు. అయితే అసలు విషయం ఏంటంటే ఎన్నికలు జరిగే సమయంలో అక్రమ నగదును సీజ్  చేయడంలో మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందంట. అందుకే ఈ నగదు నజరానా స్కీమ్  పెడుతున్నట్లు సమాచారం. ఇది అమలైతే కొంతైనా డబ్బు ప్రవాహానికి అడ్డుకట్టపడ్డట్లేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Congress election campaign
Attack on jagan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles