Attack on jagan

attack on jagan

attack on jagan

9.gif

Posted: 05/20/2012 01:27 PM IST
Attack on jagan

      ముప్పేట దాడికి జగన్ తో సహా అతని జట్టు కుదేలవుతోంది. ఇప్పుడు వై.ఎస్.జగన్ ఆస్తుల కేసు ఉత్కంఠ రేపుతోంది. ఈ కేసు ఇటు జగన్ అస్మదీయులను అటు అధికారంలో ఉన్న మంత్రులను కూడా ఇరకాటంలో పడేస్తోంది. ఓ వైపు ఈడీ మరోవైపు సీబీఐ దర్యాప్తు  కూడా ముమ్మరం కావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో?. ఎవరికి ఎవరి నుంచి పిలుపు వస్తుందో తెలియని పరిస్థితి.5 ఈ పరిణామాలు మంత్రులతోపాటు జగన్ శిబిరంలో కలకలం సృష్టిస్తున్నాయి. జగన్ ఆస్తుల కేసు రోజు రోజుకో మలుపు తిరుగుతూ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఆ పార్టీనేతలకు. ఓ వైపు సీబీఐ, మరోవైపు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తమ విచారణను ముమ్మరం చేశాయి. ఈ కేసులో మంత్రులు గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్యను సీబీఐ విచారించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఇద్దరు మంత్రులకు రేపో మాపో నోటీసులు జారీ చేయనుంది. పరిశ్రమలకు నీటి కేటాయింపులు జలయజ్ఞం టెండర్లపై సీబీఐ విచారించే అవకాశం వుంది. అయితే సీబీఐ నుంచి తనకెలాంటి సమన్లు అందలేని పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. కేటాయింపులన్నీ చట్టబద్ధంగానే జరిగాయన్నారు. సీబీఐ పిలిస్తే విచారణకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. మేకపోతు ఘాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ లోలోన జగన్ వర్గం మదన పడుతున్నట్లు తెలుస్తొంది.

       కాగా,  ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య, ఎల్వీ సుబ్రహ్మణ్యం, శ్రీలక్ష్మిని ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతించాలని సీబీఐ ప్రభుత్వాన్ని కోరింది. మరోవైపు... సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లు తీసుకున్న ఈడీ విచారణను వేగవంతం చేసింది. ఆయా కేసుల్లో నిందితులకు నోటీసులు జారీ చేసి, విచారణకు పిలిపించాలని భావిస్తోంది.
ప్రతిపక్షాలు ఈ అంశపై స్వరంపెంచాయి. జగన్ కేసును విచారిస్తున్న సీబీఐ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని టీడీపీ డిమాండ్ చేసింది. జగన్ కు సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను టీడీపి టార్గెట్  చేసింది. మంత్రులను మంత్రుల్లా కాకుండా నిందితులుగా పరిగణించి విచారించాలని  మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు సీబీఐని కోరారు. సీబీఐ, ఈడీ విచారణతో పాటు ప్రతిపక్షాల ఆరోపణలతో జగన్  శిబిరం ఉక్కిరిబిక్కిరవుతోంది. జగన్  ఆస్తుల కేసు వారికి రోజుకో కష్టాన్ని తెచ్చిపెడుతోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Election commission rules and regulations
Former minister sharkar rao  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles