Congress mp v hanumantha rao comments on chandrababu

Congress MP, V Hanumantha Rao comments on Chandrababu,Telangana Congress MP V Hanumantha Rao sensational comments on TDP chief Chandrababu Naidu

Congress MP, V Hanumantha Rao comments on Chandrababu

Hanumantha.gif

Posted: 05/19/2012 10:35 AM IST
Congress mp v hanumantha rao comments on chandrababu

Congress MP, V Hanumantha Rao comments on Chandrababu

 ఒక ఓటు రెండు రాష్ట్రాల నినాదంతో ప్రజలను బిజెపి మోసం చేసిందని విహెచ్ ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలకు విరుద్ధంగా చంద్రబాబు వ్యవహరించారని ఆయన ఆరోపించారు. తెలంగాణ కోసం ఇప్పటికే వందలాది మంది చనిపోయారని హనుమ ఆవేదన వ్యక్తం చేశారు.  తెలంగాణపై ఏర్పాటుకు తెలుగుదేశం తన మద్దతును తెలియచేసిన పక్షంలో తాము సోనియాగాంధీని ఒప్పిస్తామని కాంగ్రెస్ సభ్యుడు వి హనుమంతరావుచెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి బిజెపి సభ్యుడు ప్రకాష్ జావడేకర్ ప్రతిపాదించిన ప్రైవేట్ తీర్మానం వారం రోజుల విరామం తరువాత రాజ్యసభలో తిరిగి చర్చకు వచ్చింది. చర్చ ప్రారంభకాగానే బిజెపి సభ్యులు జై తెలంగాణ నినాదాల చేశారు. వెంటనే టిడిపి సభ్యులు దేవేందర్‌గౌడ్, గుండు సుధారాణి తమ బాణి కలిపారు.

Congress MP, V Hanumantha Rao comments on Chandrababu

బిజెపి, టిడిపిలు ద్వంద్వ నీతికి పాల్పడుతున్నాయని విహెచ్ చేసిన వ్యాఖ్యలపై దేవేందర్‌గౌడ్ మండిపడ్డారు. బిజెపి సభ్యులు ఒక అడుగు ముందుకేసి ‘మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసిన మేము తెలంగాణను ఇవ్వలేకపోయాం. మీరు ఇస్తానని చెప్పిన మాటను నిలబెట్టుకుని కనీసం ఒక్క రాష్ట్రాన్ని ఇచ్చి నిరూపించుకోండి’ అని విహెచ్‌పై ఎదురుదాడికి దిగారు. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన వెంకయ్యనాయుడు ఇప్పుడు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడడం బిజెపి ద్వంద్వ నీతికి నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నామని హోం మంత్రి చిదంబరంతో చెప్పిస్తే చంద్రబాబును తాము ఒప్పిస్తామని దేవేందర్‌గౌడ్ సవాల్ చేశారు. తన సవాల్‌ను స్వీకరించాలని అంటూ సభలో లేని వ్యక్తిపై ఆరోపణలు చేయడం సరైంది కాదని అన్నారు. ప్రతిపక్షాలు అడుగడుగునా అభ్యంతరం తెలుపుతున్నా విహెచ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇప్పటికే ఆరొందల మంది చనిపోయారు, ఇంకంత మంది బలికావాలి? అని విహెచ్ ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran kumar reddy direct comments on ysjagan
Govt issues gos for jagan property  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles