Now a nappy application for sleepless parents

Now, a nappy application for sleepless parents,sleepless nights, Mobile apps, Nappy application,Matthew Nifield invents nap-app for new parents

Now, a nappy application for sleepless parents

nappy.gif

Posted: 05/15/2012 04:19 PM IST
Now a nappy application for sleepless parents

Now, a nappy application for sleepless parents

పిల్లల్ని నిద్ర పుచ్చాలంటే జోల పాడితే సరిపోతుంది. అయితే ఎంత జోల పాడినా కూడా రాత్రుళ్లు తల్లిదండ్రుల్ని సరిగా నిద్రపోనివ్వరు గడుగ్గాయిలు. అప్పుడు మత్తు కళ్లతో జోల పాడలేక, పిల్లల్ని నిద్రపుచ్చలేక తల్లిదండ్రులు పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఇలాంటి వాళ్ల కోసమే మాథ్యూ నైఫీల్డ్ అనే ఆయన ఐఫోన్, ఐపాడ్‌లలో వాడే వైట్ నాయిస్ యాంబియెన్స్ అనే ఓ అప్లికేషన్ తయారుచేశాడు. దీనివల్ల పిల్లలకి నిద్ర రావడమే కాదు మాథ్యూకి సంవత్సరానికి 51 లక్షల పైన ఆదాయం వస్తోంది.

"మా ఆవిడకు ఒకే కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. కొత్తగా తల్లిదండ్రులయిన వాళ్లెవరికైనా ఒక్క బిడ్డను పెంచడమే కష్టం. అలాంటిది ఇద్దరు పిల్లల్ని పెంచడమంటే మాటలా. రాత్రుళ్లు నిద్రపోకుండా ఏడుస్తున్న వాళ్లను ఎలా నిద్రపుచ్చాలో తెలియక తలకిందులయ్యే వాళ్లం. వాళ్లకి ఆరు నెలలప్పుడనుకుంటా కొన్ని ధ్వనులు విన్నప్పుడు ప్రశాంతంగా నిద్రపోవడం గమనించాను. అందుకని వెంటనే నిద్రపుచ్చేందుకు ఉపయోగపడే అప్లికేషన్లు ఏమైనా దొరుకుతాయేమోనని ఐఫోన్ యాప్ స్టోర్‌లో వెతికాను. ఆ ప్రయత్నం ఫలించలేదు. అందుకు సంబంధించిన ఒక్క అప్లికేషన్ కూడా కనిపించలేదక్కడ. అప్పుడు నా సొంతంగా 'వైట్ నాయిస్ యాంబియెన్స్' అప్లికేషన్ తయారుచేశాను. ఈ అప్లికేషన్ నా కూతుళ్లకు చాలా బాగా ఉపయోగపడింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఈ అప్లికేషన్‌కు క్రేజ్ బాగా పెరిగింది. ఇప్పటివరకు దాదాపుగా రెండున్నర లక్షల మంది తల్లిదండ్రులు డౌన్‌లోడ్ చేసుకున్నారు దీన్ని. కాగా నాకు సంవత్సరానికి అరవై వేల పౌండ్ల ఆదాయాన్ని తెచ్చి పెట్టింది.

Now, a nappy application for sleepless parents

ఇందుకోసం మొత్తం 150 రకాల ధ్వనులు రికార్డు చేశాను. ఈ ధ్వనులన్నింటికీ తొలి శ్రోతలు నా కూతుళ్లే. ఒడ్డును ఢీకొన్నప్పుడు అలలు చేసే ధ్వని అంటే చాలా ఇష్టం వాళ్లకు. అది చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకు మాత్రం కారు టాప్ పైన పడే వాన చుక్కల శబ్దమంటే చాలా ఇష్టం. అది వింటే పదినిమిషాల్లో నిద్రలోకి జారుకుంటాను నేను'' అంటాడు మాథ్యూ. వైట్‌నాయిస్ అప్లికేషన్ ఐపాడ్స్, ఐఫోన్లలో వాడేందుకు ఉపయోగపడుతుంది. ఈ అప్లికేషన్‌లో ఆవిరి రైలు చేసే శబ్దం నుంచి అడవి కప్పల అరుపుల వరకు ఉన్నాయి. "వైట్‌నాయిస్ ద్వారా వస్తున్న సంపాదనతో ఆర్థికంగానే కాకుండా నిద్ర పరంగా కూడా ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాన''ని ఉత్సాహంగా చెప్పాడాయన.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Natti kumar fired on dasari and producer c kalyan
China accuses dalai lama of deceit  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles