Telangana jac leaders talk about parakala seat

telangana jac leaders talk about parakala seat

telangana jac leaders talk about parakala seat

13.gif

Posted: 05/13/2012 03:03 PM IST
Telangana jac leaders talk about parakala seat

      రాజకీయాలు నెరపి తెలంగాణలో కుట్రలు కుతంత్రాలకు జగన్ పాల్పడేందుకు యత్నిస్తున్నారని టీ జేఏసీ ఆరోపించింది. ఆంధ్రాలోవలే  తెలంగాణ ప్రాంతంలో ఆటలు సాగుతాయనుకుంటే జగన్ పొరపడ్డట్టేనని నేతలు విమర్శిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిన వైఎస్ అతని తనయుడు జగన్ ను ప్రజలు క్షమించరని వారు దుయ్యబట్టారు.aa అంతేకాదు.. పరకాల ఉప ఎన్నికల్లో సమైక్యవాదులకు స్థానం లేకుండా చేస్తామని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం చెప్పారు. ఇక్కడ పోటీకి సంబంధించి టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీని నివారించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
      "ఎన్నికలను ఉద్యమ వ్యూహంలో అంతర్భాగంగానే చూస్తున్నాం. గత మూడేళ్లుగా తెలంగాణ ఉద్యమంలో సమైక్యవాద కుట్రలను ఎదుర్కొంటూ.. ప్రజలను ఐక్యం చేస్తూ ముందుకు సాగుతున్నాం. పరకాల ఉప ఎన్నికల్లోనూ సమైక్యవాద శక్తుల ఉనికి లేకుండా చేస్తాం''kon అని చెప్పారు. పరకాల ఉప ఎన్నికల్లో పోటీ నివారించాలని టీఆర్ఎస్, బీజేపీలను కోరామని, మరోసారి కలిసి అభ్యర్థిస్తామని, ఇక్కడ రెండు పార్టీల తరఫున ఒకే అభ్యర్థి బరిలో ఉంటారని ఆశిస్తున్నామని చెప్పారు. రెండు పార్టీల మధ్య పోటీ నివారించే యత్నాలు జరుగుతున్నాయని, అన్ని విషయాలను బయటికి చెప్పలేమని అన్నారు.
     సమైక్యవాది జగన్ మానుకోట పర్యటనను అడ్డుకొని మే 28 నాటికి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. "కొండా సురేఖ సమైక్యవాద పార్టీ సభ్యురాలు.  నాగం మాదిరిగా సమైక్యవాద పార్టీతో తెగదెంపులు చేసుకోవాలి. అలా కాకుండా ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా.. మరే పద్ధతిలో బరిలోకి దిగినా జగన్ పార్టీలో భాగమనేది జగమెరిగిన సత్యం'' అని అన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kurnool jatara after 72 years
Lk advani and pranabh mukharji and arun jaiitly speaks  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles