Super moon tonight

super moon tonight

super moon tonight

39.gif

Posted: 05/06/2012 04:54 PM IST
Super moon tonight

       moonఈ ఒక్క రోజు... మీకు అత్యంత సమీపం లో, అతిపెద్ద సైజులో పండువెన్నెల కురిపిస్తూ చంద్రుడు కంటపడబోతున్నాడు. చంద్రుడు, భూమికి అతి సమీపంలో ఉండబోతున్నాడు. ఆదివారం ఈ అద్భుతం ఆవిష్కృతం కానుంది.ఈ ఏడాదిలోని రాత్రులన్నింటిలోకెల్లా విభిన్నరీతిలో చంద్రుడు భూమికి అతి సమీపంలో దర్శన మివ్వటం ఒక గొప్ప విశేషం. ఈ ఘటనను 'సూపర్‌మూన్‌'గా అభివర్ణిస్తారు.'బుద్ధ పూర్ణిమ' రోజే ఈ అద్భుత ఆవిష్కరణ ఘట్టం చోటుచేసుకోనుంది.
       మే 6 (ఆదివారం) రాత్రి 9-05 గంటలకు భూమి, చంద్రుడి మధ్య దూరం 3,56,955 కి.మీ.లు ఉండబోతోంది. ఈ ఏడాది ఇంత అతి సమీపంలోకి రానుండటం చర్చనీయాంశం అవుతోంది. 0.5515 డిగ్రీల పరి మాణంలో చంద్రుడు కనిపించనున్నాడని శాస్త్రవేత్తలు చెప్పారు. సూర్యోదయానికి కొద్ది నిమిషాల ముందు పశ్చిమదిక్కున ఈ సూపర్‌ మూన్‌ ఆవిష్కృతం కానుంది. సూర్యాస్తమయమైన గంట తర్వాత ఈ దృశ్యం మళ్ళీ పునరావృతం కానుందని ముంబయికి చెందిన నెహ్రూ ప్లానిటోరియం డైరెక్టర్‌ అరవింద్‌ పరాంజ్‌పే తెలిపారు.
       కాగా, ఈ ఏడాది నవంబర్‌ 28న చంద్రుడు, భూమికి చాలా దూరంలో కనిపించనున్నాడు. ఈ రెండింటి మధ్య 4,06,349 కి.మీ.ల దూరం చోటుచేసుకోనుంది. మే 6న కనిపించనున్న నిండు చంద్రుడు, నవంబర్‌ 28న దర్శనమివ్వనున్న నిండు చంద్రుడి కంటే 11శాతం పెద్దదిగా ఉండబోతున్నాడు. ఇంకెందు కాలస్యం కనులారా చంద్రుడిని చూసి తరించండిమరి..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Somashekara reddy to contest from sriramulu party in next poll
Ntr tdp leader lakshmi parvathi says  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles