జూనియర్ ఎన్టీఆర్ వర్గాన్ని సాగనంపే ప్రయత్నంలో టీడీపీ అధినేత దమ్ము సినిమా ఏం బాగలేదు.. వేస్ట్.. ఇదీ టీడీపీ నేతల ప్రచారం. దమ్ము సినిమా చూడొద్దు.. ఎస్ఎంఎస్లు.. సినిమా విడుదల రోజు కృష్ణా జిల్లా బంద్‌కు పిలుపు ఇచ్చిన టీడీపీ.. జూనియర్ ఎన్టీఆర్ వర్గీయుడైన వల్లభనేని వంశీకి షోకాజ్ నోటీస్ జారీచేసి ఆయన వర్గంపై దాడిని తీవ్రం చేసింది. దీన్ని కట్టడి చేయడమో.. లేదా తెగదెంపులు చేసుకోవాలనో.. మామ చంద్రబాబు చేస్తున్న యోచనగా జూనియర్ ఎన్టీఆర్ వర్గీయులు భావిస్తున్నారు. కొంత కాలంగా మాజీ ఎంపీ హరికృష్ణను చంద్రబాబు దూరంగా పెడుతున్నారు. తండ్రి హరికృష్ణకు పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేయడాన్ని జూనియర్ ఎన్టీఆర్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్ అనే విషయాన్ని బాబు 2009 నాటికే గుర్తించారు. 2009 ఎన్నికల్లో జూనియర్ చేత ప్రచారం చేయించారు.
ఆయనకు మాస్ ఫాలోయింగ్‌ను మొదట గుర్తించి ఉపయోగించుకొని లబ్ధిపొందింది కూడా చంద్రబాబే. జూనియర్‌ను చెప్పుచేతల్లో పెట్టుకోవడానికే పెళ్లి కూడా బాబే కుదిరించాడన్న ప్రచారం కూడా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ స్వతహాగా సొంత వ్యక్తిత్వంతో ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తాడు. అలాంటి అతణ్ని తన దారిలోకి తెచ్చుకోవాలని, తను చెప్పినట్లు వినేవాడిలా చేసుకోవాలని ప్రయత్నించిన బాబు.. ఎక్కడ తనకు ప్రత్యామ్నాయంగా ముందుకు వస్తాడోననే భయంతో అణిచివేయాలని కుట్ర పన్నాడని జూనియర్ వర్గీలు భావిస్తున్నట్లు సమాచారం.ఒక దశలో చంద్రబాబు తర్వాత టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ వారసుడన్న చర్చా జరిగింది. అవకాశం కోసం చూసిన బాబు మొదట హరికృష్ణకు రాజ్యసభ సీటు నిరాకరించారు. ‘దమ్ము’ ఆడియో రిలీజ్‌కు కావాలనే రాలేదని, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య విభేదాలు సృష్టించారన్న చర్చ ఆయన అభిమానుల్లో జరుగుతోంది. ఇప్పుడు ఏకంగా సినిమా బాగా లేదంటూ ప్రచారం చేస్తూ, సినిమా రంగంలో కూడా జూనియర్‌ను కట్టడి చేయాలని బాబు స్కెచ్ వేశాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాను పార్టీ వీడటంలేదని వల్లభనేని వంశీ వివరణ ఇచ్చినా టీడీపీ నేతలు పట్టించుకోవడంలేదని, అతనిపై వేటు వేయడానికి పార్టీ సిద్ధమైందన్న ఆరోపణ వినిపిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more