Cm kiran kumar reddy greets governor

cm kiran kumar reddy greets governor

cm kiran kumar reddy greets governor

9.gif

Posted: 04/29/2012 12:36 PM IST
Cm kiran kumar reddy greets governor

    రాష్ట్రానికి రెండోసారి గవర్నర్‌గా నియమితులైన ఈఎస్‌ఎల్ నరసింహన్‌ ను పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు అభినందిస్తున్నారు.  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి నరసింహన్ కు అభినందనలు తెలిపారు. ఈ ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను ముఖ్యమంత్రి కలిశారు. మంత్రులు వట్టి వసంతకుమార్, పొన్నాల లక్ష్మయ్య కూడా నరసింహన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు గవర్నర్‌కు అభినందనలు తెలిపేందుకు తరలివస్తున్న ప్రముఖులతో రాజ్‌భవన్ సందడిగా మారింది.
      govగవర్నర్‌గా పునర్ నియమితులైన నరసింహన్ మే 3న రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ నరసింహన్‌తో ప్రమాణం చేయిస్తారు. ఇప్పటి వరకు గవర్నర్‌గా ఉన్నా.. మళ్లీ నియమితులైనందున ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.
        నరసింహన్ పదవీ కాలాన్ని పొడిగించినట్లు వార్తలు రావడంతో... రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది గవర్నర్‌ను అభినందనలతో ముంచెత్తారు. కేక్ కట్ చేయాలని పట్టుబట్టారు. అధికారికంగా ఉత్తర్వులు వచ్చాక చూద్దామని నరసింహన్ చెప్పినా.. సిబ్బంది పట్టుపట్టడంతో గవర్నర్ ముఖ్య కార్యదర్శి రమేశ్ కుమార్ కేక్ తెప్పించారు. కానీ, నరసింహన్ వెంటనే కేక్ కట్ చేయలేదు. ముందుగా తన తల్లికి నమస్కరించి ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తర్వాతే కేక్ కట్ చేశారు

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  A women killed by her husband today in mahaboob nagar district
Tdp coming to an end says radha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles