Trs president kcr says after by pols there is a

trs president kcr says after by pols there is a ..

trs president kcr says after by pols there is a ..

21.gif

Posted: 04/27/2012 10:22 PM IST
Trs president kcr says after by pols there is a

       పరకాల ఉపఎన్నిక తర్వాత మహొద్యమాన్ని నిర్మించి తెలంగాణ సాధిస్తామని టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చెప్పారు. వికారాబాద్ లో జరుగుతున్న టిఆర్ఎస్ 11వ వార్షికోత్స వ సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణవాదం పేరుతో ఇప్పుడు కొందరు కొత్త భిక్షగాళ్లు వస్తున్నారని అన్నారు. జాతీయ పార్టీల పేరు చెబుతున్నారని, ఇప్పుడసలు జాతీయ పార్టీలున్నాయా? అని ఆయన ప్రశ్నించారు. పేరు జాతీయం, ఉనికి ప్రాంతీయం అని విమర్శించారు. జాతీయ పార్టీలను నడుపుతుంది ప్రాంతీయ పార్టీలే అన్నారు. భారతదేశ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ ఒక ప్రబలమైన శక్తిగా ఎదుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
       KCR-2ఆరు నూరైన టీఆర్‌ఎస్ ఏ పార్టీలో విలీనం కాదని స్పష్టం చేశారు. పార్టీ విలీనానికి సంబంధించి జరుగుతున్న విషప్రచారాన్ని నమ్మద్దని చెప్పారు. తెలంగాణ సాధన తర్వాత తెలంగాణ పునఃనిర్మాణమే టీఆర్‌ఎస్ లక్ష్యం అని ఆయన తెలిపారు. ఆయన మొదట ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలవేసి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొప్ప పోరాటయోధుడు జయశంకర్ అని కొనియాడారు. సమైక్య పాలనలో తెలంగాణ జీవనం విధ్యంసం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాశవిక అణచివేతల వల్లే తెలంగాణ ఉద్యమాలు ముందుకు సాగలేదన్నారు. త్యాగాల పునాదుల మీద టీఆర్ఎస్ ఏర్పడిందని చెప్పారు.
       కలుషిత జలాలతో పొంగిపొరలే మూసినదికి తెలంగాణ వస్తేనే పూర్వవైభవం వస్తుందన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత వికారాబాద్ జిల్లా ఏర్పాటు చేస్తామని ఆయన హమీ ఇచ్చారు. పార్లమెంటులో రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రకటన చేయించి మోసం చేసిందన్నారు. ఇప్పటికీ తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోందన్నారు. మాట నిలబెట్టుకోమని తెలంగాణ ఎంపీలు అడిగితే వారిని సస్పెండ్ చేశారన్నారు. ఇది తెలంగాణకు జరిగిన అవమానంగా ఆయన పేర్కొన్నారు. సస్పెండయిన ఎంపిలు ఇంకా కాంగ్రెస్ కాళ్లు పట్టుకొని వేళాడవద్దని సలహా ఇచ్చారు. తెలంగాణ దెబ్బకు చంద్రబాబు, ఆయన పార్టీ కుప్పకూలి ఇంకాలేవలేదన్నారు. 2009 ఎన్నికల్లో టీడీపీ మిత్రద్రోహానికి పాల్పడిందని ఆరోపించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Reception for mega fance on 15th june chiranjeevi
Vangaveeti radha joins ysr congress party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles